పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

290 శుకసప్తతి


సందియంబు వొడమిన నడంచికొని తదానీతుండై గృహంబుఁ బ్రవేశించి దీపప్రభాధగధ్ధగాయమానం బగు తదీయశరీరంబును ననన్యసంచారంబునుం గని దానియందు నిజభార్యానిర్విశేషంబు దోఁపఁ జూచుచున్న నక్కురంగనయన డెందంబు గరంగినదాని తెఱుగున మిడిసిపడు గోడెబేడిసల పసం గులుకు బెళుకుచూపులు కొన్ని వానినెమ్మేనం గ్రుమ్మరించి కల్పితక్రీడాభరంబు లీడుజో డాడ నతని కిట్లనియె. 187

తే. ఏమి యమరింతు వన్ని నాయింట నిండి
యున్న విప్పుడ యమరింతు నోపననక
వండిపెట్టెదఁ బొమ్మన్న వాఁడు వట్టి
వేడుక జనింపఁగాఁ బణ్యవీథి కరిగి. 188

ఉ. కూరలు సన్నబియ్యమును గ్రుడ్డులకోళ్లును జింతపండు సం
బారము లుప్పు నెయ్యొ లుపుఁబప్పు మొదల్గొని తెచ్చి యన్నియు
న్వేఱుగ నింటిలో నులుపనించిన కైవడి నుంచె లేఁతన
వ్వారఁగ నవ్వధూమణి రయంబునఁ బాక మొనర్చి యంతటన్. 189

క. మామా యిన్నియుఁ దెచ్చితి
తేమానమీదేల వేగుదీపమువలదా
యాముదము దెము పొమ్మన
నామందవిచారుఁ డప్పు డంగడి కరిగెన్. 190

తే. అరుగ హేమాంగి యిది వీని కారగింపు
సేయఁగా నేమిగలదు మా జెట్టి కిడుట