పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 289

తే. మంచి దధికారి నగుచు నమ్మనుజవిభుని
గొలిచియైనను గొంపలు గూల్పకున్న
సడ్డసేయుదురే యంచుఁ జనెడువానిఁ
గాంచి హేమాంగి ప్రొద్దుపోకలకుఁ బిలిచి. 185

క. ఏమోయి యేల దూఱెద
వీమాడ్కిం బురమువారినెల్లను నీ పే
రే మెచ్చట నుండుదు వీ
గ్రామంబున కరుగుదేఱఁ గారణ మేమో. 186

వ. అన నప్పలుకులకుఁ జంద్రికాసక్తచకోరకంబునుంబోలెఁ దిరిగి తత్సమీపంబున కరిగి యోపుణ్యాత్మురాల నీవైన నాదరించి మంచిమాటాడితివి గదా యిదియే నాకుం బరమలాభంబు మధురాపుకంబు నాకాణయాచికాఁపురంబు తామరతంపర మదీయగృహంబు శ్రీధాన్యకటకంబు మదన్వయంబున కాకరంబు కంబుధరపాదాంబురుహంబు వేదలతాలవాలంబు నగు శేషశైలంబున కరిగి క్రమ్మఱి వచ్చువాఁడఁ బ్రొద్దుగాని ప్రొద్దున నీయూరిం జేరి నెప్పెఱుంగమిం జేసి యన్నవిక్రయపరాయణాయతనంబులుం గానక యాఁకటఁ గటకటంబడి గ్రాసంబు వేడినఁ జెడుపురువునుం బోలె విదలించువారలేగాని యాయాసం బెఱింగి రమ్మనువారు లేరు మాడలుండినంత గూడు గాదుగదా వలసినపదార్థంబుఁ దెచ్చియిచ్చెదఁ బాకం బొనర్చి పెట్టిన నీకులకోట్లకుఁ బుణ్యంబయ్యెడు నని నుడివి యెడనెడ నప్పడంతి యల్పస్వరంబున నిజవయఃప్రమాణాదు లడుగుట వలనను మందమందంబుగా భాషించుమనుటవలనను గొంతకొంత