పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 261

లజ్ఞానమ్రవదనయై సదనంబునకుం జనియెనని పల్కునవసరంబునం బ్రభాతం బగుటయు. 45

క. అంతిపురంబున కరిగి ది
నాంతమున న్నృపతిఁ జేరి నరిగెడుతమితోఁ
జెంతకు వచ్చినకోమటి
యింతింగని చిలుకరాయఁ డిట్లని పలికెన్. 46

క. రమణీ యాధూర్తచకో
రముకథ యిఁకఁ గొంత కలదు రాజవియోగ
భ్రమమడఁచి తెచ్చికోల్నె
య్యము తోడుతనైన వినుమటంచుం బలికెన్. 47

క. ఆగతి నింటికిఁ జని యా
బోగము ముసలాపె యాత్మపుత్రికతో నా
జాగెల్ల దెలిపి పరిభవ
యోగంబున మదికి ఖేద మొదవఁగ నంతన్. 48

సీ. పుట్టలమ్మ యటన్నఁబో యెంతలేదను
సందివీరుల టన్న జాము గొణుగు
నెక్కలమ్మ యటన్న నొక్కటికొదవను
బోతురాజు లటన్న బూతు నుడువు
ధర్మరాజు లటన్న దబ్బఱలే తిట్టుఁ
గంబమయ్య యటన్నఁ గ్రాసి యుమియు
గ్రామగంగ యటన్నఁ గాదా మరో యను
దేవాదులన్న గద్దించి చూచు
తే. నిన్ని దేవళ్లఁ గొలిచి నేనేమి గంటి
పోయి పచ్చని పులుగాసిపులుఁగుచేత