పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

260 శుకసప్తతి

క. అని రట్టుసేయ నచ్చటి
జనములు సొమ్మీయకునికి చనదని వగదెం
చిన దాని దోడుకొనిపో
యె నతం డింటికిని రొక్క మిచ్చెద నంచున్. 41

క. చని ధూర్తచకోరమునకు
దనవృత్తాంతంబుఁ దెలుపఁ దత్కీరము న
వ్వి నిజంబుగఁ గెలిపించెద
నిను వెఱవకు మనియె వైశ్యనీరజగంధీ. 42

క. ఆవైశ్యునిఁ దత్కీరం
బేవిధి గెలిపింపవలయు నెఱిఁగింపఁగదే
నీవే జాణ వటన్నన్
భావించుచుఁ జిలుకతోఁ బ్రభావతి పలికెన్. 43

క. ఏలాగున గెలిపించెనొ
బాళిమెయిం బ్రహ్మలోకపర్యంతము నే
నాలోచన యొనరించితిఁ
జాలదు నాహృదయ మిది నిజంబుగఁ దెలియన్. 44

వ. అనిన విని యవ్విహంగమపుంగవం బనంతరకథావిధానం బిట్లని తెలుపం దొడంగె నవ్విధంబున నాధూర్తచకోరంబు దత్తప్రతిజ్ఞం బైనవిత్తంబు సోమదత్తునిచేత మూటగట్టించి దానికిం గట్టెదుర నొక్కనిలువుటద్దంబుఁ బెట్టించి పెద్దలతో నవ్వెలముద్దిం బిలిపించి దర్పణప్రతిబింబితార్థంబుఁ గైకొనుమని పలికిన నచ్చటివారును స్వప్నదృష్టంబునకు నిదియె సమానంబని నిర్ణయింప నప్పణ్యవృద్ధయు నగణ్య