పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యున్నది. ఆప్రతి విద్వచ్చిరోమణియు భాషాభిమానియునగు సి. పి. బ్రౌనుదొరవారివలన వాయింపఁబడినది. అందు వార చ్చటచ్చట వ్రాసిన తమ యభిప్రాయముల నీ క్రింద నాంధ్రతాత్పర్యముతో నుదహరించి ఫలితార్థమును గ్రహింపుఁడని పాఠకులకు విన్నవించుచున్నారము.

"This Sukasaptati or Tales of the Parrot in Telugu, being a series of amorous tales. Twenty in number, the book not having been completed, this is very rare and merits publication, as abounding in common colloquial expressions.

This edition was prepared under my directions in the year 1831.”

(తా॥ ఈశుకసప్తతి లేక చిలుక చెప్పిన కథలు అనునవి తెనుఁగులోఁ గొన్ని చక్కని శృంగారకథలు, పుస్తకము పూర్తిగా లేదు. ఇవి యిరువదికథలు, సాధారణముగా వాడుకభాషలో వ్రాయఁబడినందున నిది యరుదైనదియు ముఖ్యముగా బ్రకటింపవలసినదియును. ఈ వ్రాఁతప్రతి నానియోగమువలన 1831 సం॥ న సిద్ధము చేయఁబడినది.)

మఱియొక తావున (గ్రంథాంతమున) నీ క్రిందిరీతిని వ్రాయఁబడియున్నది.

SUKASAPTATI.

A series of Telugu stories illustrating the various dialects of the Telugu language,

This valuable work is very rare indeed and I never met with a perfect copy. The present one has