పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమముద్రణపీఠిక

ఈ గ్రంథకర్త పాలవేకరి కదిరీపతినాయకుఁడు. కృత్యాది పద్యములు దొరకనందున నిక్కవి కాలనిర్ణయాదుల కిచట ననువుపడలేదు. కదిరి రాజ్యమును బాలించిన ప్రభువు. ఈకదిరి యనునది నెల్లూరుమండలములోనిదని చారిత్రకులగు రావు బహద్దరు కందుకూరి వీరేశలింగము పంతులుగారు తమయాంధ్రకవుల చరిత్రములో వ్రాసియున్నారు. మనకుఁ గడపజిల్లాలో నగపడుచున్నది. ఇక్కవికవిత్వము స్వభావసిద్ధములు సమయోచితములునగువర్ణనలతో క్రొత్తరుచులను బుట్టించుచుఁ బ్రౌఢమై హృదయంగమ మై యున్నది. సంస్కృతాంధ్రములు రెంటియందును సమానప్రజ్ఞ కలవాఁడు. హంసవింశతియందువలె నిందతిగా వర్ణించి యుండలేదు. కాని యవసరము కలిగినప్పుడు చమత్కారములను విడిచిపెట్టలేదు.

ఇప్పొత్తము మాకు మొదట పుదుక్కోటసంస్థానములోని పుస్తకభాండారమునుండి దివానుగారగు మహారాజ శ్రీ దివాన్ బహదరు సీలం రామదాసునాయుడు, బి. ఏ., బి. యల్ ., గారిచే దయాపూర్వకముగా నంపఁబడినది. ఆతాళపత్రగ్రంథము శిథిలమై యుండినందున శుద్దప్రతి తేలక మద్రాసు గవర్నమెంటు ఓరియంటల్ మాన్యూస్క్రిప్ట్సులైబ్రరీలో నున్నదాని కొకప్రతి వ్రాసి తెచ్చితిమి. అదియు నసంపూర్ణముగానే