పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

229 శుకసప్తతి

క. కని వచ్చితి వెఱవకుఁ డని
తనచేలము దాని కిచ్చి దానిపటంబుం
దనకటి ధరియించి రయం
బునఁ బళ్లెర మీవు గొంచుఁ బొమ్మని పనిచెన్. 497

క. [1]పనిచిన మెచ్చుచు హలికాం
గన యీశ్వరుమ్రొక్కు చెల్లెఁగద యింక మము
న్మునపటివలె మనుపుము దయ
నని చని పతిప్రక్క ముగ్ధయై పవళించెన్. 498

ఉ. అంతఁ దలారు లాత్మవిభుఁ డచ్చటికిం జనుదేర జారవృ
త్తాంతము దెల్పఁ బట్టుఁడని యాతఁడనం గుడిసొచ్చి దివ్వటీ
ల్చెంతకుఁ దెచ్చి చూచి యిది శీలవతీసతి యీతఁ డెంచఁ ద
త్కాంతుఁ డటంచు సిగ్గువడి తప్పెఁ బ్రయోజన మంచుఁ బోయినన్. 499

తే. రమణుఁ దోడ్కొని తనమందిరమున కరిగె
శీలవతియంచు వచియించు చిలుకఁ జూచి
యాప్రభావతి యప్పుడే యదిగొఁ దెల్ల
వాఱెనని యేగెనంత నగారమునకు. 500

క. చని నాఁటిరేయి నరపతి
నెనయం దద్గేహసీమ కేగెడుదానిం
గనుఁగొని యొకకథ వినుమని
యనియెం గీరంబు పలుకు లమృతము దొలఁకన్. 501

  1. క. అప్పు డాశీలవతికేల నొప్పుపళ్ళె
    మెలమి తానందుకొని కాఁపుటింతి శివుని
    మ్రొక్కుచెల్లించువిధమున ముద్దునడల
    గుడివెడలి చేరె నిల్గుల్కుగుబ్బలాడి.