పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 187

వ. అని పలికి విరహిజనమథనంబున మనసిజుండు పట్టించు [1]ధర్మదారోదయంబునుంబోలి మిక్కుటంబగు కుక్కుటారవంబున నరుణోదయం బగుట యెఱింగి యక్కురంగనయన యంతఃపురంబునకుం జనియెఁ దదనంతరంబ. 303

క. వనజరుచిఁ గొనఁగ సమయం
బనుచోరుఁడు రోదసీగృహముఁ జొచ్చి భయం
బునఁ బఱవ నడఁచుదీపం
బునఁ బోల్పంబడుచుఁ బ్రొద్దు పొటుకునఁ గ్రుంకెన్. 304

చ. ప్రవిమలమౌక్తికంబుల తురాయి నిగన్నిగల న్మెఱుంగు చ
నవ మనుగెంపుదండల దగద్ధగలం బయలొందనీక నీ
లవసనపున్ముసుంగు పొదలంగఁ బ్రభావతి వచ్చె నత్తఱిన్
గవిసెన లోకలం జకచకల్గల దర్పణలక్ష్మి గేరుచున్. 305

క. వచ్చుటయు నిచ్చలంబున్
బచ్చలపంజరము వెడలి పడఁతీ యిదె యే
నిచ్చట నున్నానని యను
పచ్చనివిలుకానితేజిఁ బరికించి వెసన్. 306

క. నిన్నఁటికథ మఱి యింకను
నున్నదియో యుండెనేని యుచితవచస్సం
పన్నతఁ దెలిపెదె గ్రక్కున
నన్నరపతిపొందు నేఁటికైన న్వలయున్. 307

క. అన శుక మిట్లను గుతుకం
బునఁ గథ కొదవ యన నెంత మూఁడేమాటల్

  1. ధర్మదార=యుద్ధము మాన్పుటకై పట్టించుకాహళధ్వని