పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xvii

క. కుముదబిలంబను నొకపుర
    మమరు సురవ్యజనితధ్వజానీకమద
    భ్రమదప్రమదప్రమదా
    సుమదామకటాక్షజనితసూనశరంబై.(15 వ కథ)

ఇత్యాదులందలి సంస్కృతసమాసములకూ ర్పీకవి యుభయకవిమిత్రుఁడని తెలుపుచున్నది. చిత్రకళాపరిణతిఁ జెందిన చిత్రకారుఁడు తనకుంచెతో రేఖల గీసి రంగులనుంచి యెట్లు మనోహరదృశ్యముల మనయెదుటఁ బెట్టునో యటులే యీకవియుఁ గొన్నిసుందరానుగుణ్యపదములతోఁ దాను వర్ణించినవ్యక్తినిగాని వస్తువునుగాని మనయెదుట ప్రత్యక్షమగువట్లు చేయును. ఒకసిన్నది క్రమక్రముగా నెదిగి పెద్దదైనదనుటకు— "అంతనది యంతయై యింతయై వినూత్నపేశలాకారయై మించి పెండ్లి కెదుగ" అని సంగ్రహముగా చిత్రించి నిరూపించెను. ఇతర కవులైదు పద్యాలలో వ్రాసినను మనసులో హత్తుకొననిదృశ్యము నయిదు బిరుదములతో సరిపుచ్చినాఁడు. మేఘము కొద్దికొద్దిగా పెరిఁగి యాకాశమంతయు నిండుకొనుటను “అపు డొక్కించుక మబ్బు గానబడి యింతై, యంతయై, మించి, విష్ణుపదంబంతయు నాక్రమించి” అని మనోహరముగా చిత్రించి చూపించెను.

2. నుడికారము:--ఇతని శైలిలో జాతీయములు నిండుగాఁగలవు. ప్రాచీనులు జానుతెనుఁగున కుత్తమస్థాన మిచ్చిరి. ఈకవి కవితయంతయు జానుతెనుఁగే. తలవెఱ్ఱిగొని, పులిపులియయ్యె, నలినలియయ్యె, గులగులయయ్యె, తుకతుక, సవసవ, పిలపిల, కడుపుచుమ్మలుచుట్ట, పంటపగబట్టె, పుడకలు విరిచిన,