పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 129

యాక్షేపించుచు స్వజనంబులు సొచ్చి సమ్మర్దబాహుళ్యంబునం బోలి వెలమచ్చెకంటుల నంటుగల్గుటం జేసి వారల నవ్వలకుం ద్రోసిచనినఁ జేయునది లేక యిచ్ఛావిహారవిరోధి యగు నిజకులాచారంబులం దలంచుకొని యుస్సురను విదగ్ధముగ్ధేందుముఖులును, బర పురుషభోగాయత్తచిత్త లగుటం గ్రందుకొను సందడిం బడి కంటికిం బ్రియంబైనవానిం గామించియు గోరంజీరియుఁ గొంత యాసతీర్చుకొని యంతట నతం డెఱిఁగినం గలంగి తొలంగి చన వెండియు నతండు వెంటంబడిన నదరంట జంకించు కామినులును, దైవనమస్కారంబులు దూరంబు చేసి పదుగురైదుగురు గుమిగూడుకొని కోడెకాండ్రరూపాధిక్యహైన్యంబు లుపన్యసించు సామాన్యకన్యకలును మఱియుఁ గటిఘటితార్ద్రవసనఖండంబులతోఁ బొర్లుదండంబు లిడువారలకు మార్గక్షుద్రశిలాకలాపంబు లవ్వలం ద్రోచివైచి యెండ మెండునం బెండుపడకుండ గడితంపుపచ్చడఁబు లుల్లెడలవడువుసంబట్టువారును నిట్టసిగలు మిట్టిపడ లలాటపట్టికలం బెట్టిన పట్టెవర్ధనంబులు వర్ధమానఘర్మజలంబులం గరంగ భక్తిపారవశ్యంబున నాయాసం బెఱుంగక వర్తించుభాగవతులకు వ్యజనవీజనంబుల దయాభాజనంబు లగుచు వీచువారును నాగంతులకు శీతలోదకంబులుం బానకంబులును నీరుమజ్జిగయుం దెచ్చి కైకొనుం డని ప్రార్థించి యిచ్చువారునుం గలుగు రాజవీధుల వేంచేయు నప్పుడు. 10

క. చెప్పెడి దేమిఁక నొకచో
దెప్పరమగు నుక్కుజీను దిగవైచిన వే