పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128 శుకసప్తతి

వ్యాపారాపారసుఖం
బేపార న్మెలఁగుచున్న యెడ నప్పురిలోన్. 8

క. దేవాలయంబు కలదు త
దావాసమున న్వసించు నంతర్లలిత
శ్రీవత్సునకు రథోత్సవ
మావిష్కృతమయ్యెఁ బశ్యదఖిలామరమై. 9

వ. ఇత్తెఱంగున నభంగనభోమధ్యరథ్యాధ్వనత్సముద్యధ్వజంబును నదభ్రమేరుభ్రమావలమానభానుకంబును నిజాంతరదంతురితమౌరజికపాణవికదుర్దమమర్దలధ్వాననృత్యమానవైమానికమానీనీనికరంబును నగరథోత్తమంబుపై మధువిరోధి యధివసించినం దదుత్సవాలోకనాయాతనానాజనపదవ్రాతంబులతో నదృష్టపూర్వం బగుట నొగలందగు దారుకల్పితదారకాకారంబునకు దేవతామనీషం జేసి గోరంటయంటునం గెంపుసొంపుగ్రమ్ముకొను కేలుదము లెత్తి మ్రొక్కునెడ నందులకుఁ గ్రొత్త గుమ్మలనియాతతాయు లొత్తుకాండ్రునుం దారును లేని జగడంబుల బహులంబు లగు తుములంబులు గల్పించి గుంపులు చేసిన నాసందునం దమతమ జనంబులం గానక కాందిశీకులైనవారల మీవారిం జూపెద మని తోడుకొనిపోయి విజనస్థలంబుల నొడంబడకుండినఁ బుడమిం బడవైచి యీలువుగొని విడిచినం గ్రమ్మరి తము నన్వేషించునత్తమామలం గలసికొని తేలుగుట్టినదొంగలంబోలె మెలంగు ముగ్ధాంగనలును బూర్వానుభూతలగునుపభర్తలం బ్రయత్నంబులం గాంచి కనుసన్నలఁ గొన్ని చిన్నెలు నెఱపిన నదిగని రోషకషాయితాక్షులై