పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108 శుకసప్తతి

వనవాటి న్విహరింపఁ బంపఁడొ కృపాస్వాంతైకవాత్సల్యవ
ర్తనముల్ చూడఁగ రాజనీతియె నరేంద్రాయంచు బోధించుచున్. 463

తే. [1]మానుమీ మోహమని తెల్పి మానవేంద్రు
చిత్త మొగ్గించి యొకమాటఁ జేసి రాచ
కొమిరె నిదురించుతఱి మందసమున నుంచి
వీడువెడలించుకొని తెచ్చువేళ నెదుట. 464

సీ. కలశోద్భవానీతకలితపుణ్యసమేత
యఖిలజగత్పూత యైనమాత
జడధినాయకు నేలుబడి గన్నయిల్లాలు
నిఖిలపుణ్యపుఁజాలు నిలుచుప్రోలు
ఆభ్రఘట్టనఖేలనాభీలకల్లోల
యఘతూలికాజాల మడఁచు కీల
ఫణిలోకవిజ్ఞానపాటవాంతర్మీన
వినుతసత్యవితానమునకు సోన
తే. యధిపతి సమాగమార్థప్రయాణసమయ
సమధికోత్తుంగభంగసంచారజనిత
ఘనగరుధ్వానపటపటాత్కారసార
భూరిసితపక్షభేరి కావేరి వెలయు. 465

ఉ. ఆవరవాహినిం గని దురన్వయు లచ్చటి మంత్రు లెల్ల
లావతియున్న పెట్టియ నలంఘ్యతరం బగు తజ్జలంబునం
బోవిడిపించి భూవిభునిపొంతనె యెప్పటియట్ల యుండి రా
హా వివరం బెఱుంగని దురాత్ములకృత్యము లట్టివేకదా. 466

  1. ‘మంత్రులందఱుఁగూడి యామానవేంద్రు’ అని పాఠాంతరము.