పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 83

సరగున దుర్గము ల్సాధింపఁ జనువేళ
వైరిభూభుజు లెత్తివచ్చువేళ
గుఱు తెఱుంగనిజను ల్గొల్వవచ్చినవేళ
మృగయావినోదాప్తి మెలఁగువేళ
తే. మండలేశ్వరుఁ డుద్దండదండనాథ
చండభటవీరసామంతమండలంబు
లండనుండక వెస నొంటి నుండెనేని
గొదవ యగునండ్రు నీతికోవిదులు తలఁప. 335

తే. మత్తకరిదండ నెరయైన మావటీఁడు
బుద్ధియెఱుఁగని కొమరుని పొంతదాది
యతులగర్వాంధుఁ డగురాజునండ నాప్త
మంత్రి యొకవేళ నైన నేమఱఁ దరంబె. 336

క. బల మనఁగ నృపునిదేహము
బలమునకు న్నృపవరుండు ప్రాణం బగుటం
బలమును నృపుఁడును ధాత్రీ
తలనాయక భేద మనఁగఁ దగునే జగతిన్. 337

చ. అనుపమధైర్యశౌర్యనిధియౌ నృపుఁడైనను జైత్రయాత్రగా
జనునెడ దోఃప్రతాపబలసంఘములం ఘను లౌనిజాప్తులం
జనువుఘటిల్ల గొల్లముదుసళ్లఁ గులాగతనీతిమార్గవ
ర్తను లగు ద్దల న్నగరిదండఁ బ్రచండత నుంచఁగాఁ దగున్. 338

వ. అదియునుం గాక దినదినప్రవర్ధమానుం డగుభూనాథుండు ధారుణీతలంబు నిర్వైరమండలంబును నిశ్శేషజారచోరంబును నిబిడీకృతగ్రామకూపతటాకకుల్యారామంబును