పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72 శుకసప్తతి

కరూశ కాశ్మీర మగధ మత్స్య మాళవ మహారాష్ట్ర సౌరాష్ట్రాది బహువిధదేశంబు లవలోకించుచున్నంత నక్కళింగమహీమండలంబున. 283

క. కటక మనఁదగు నొకానొక
పుటభేదన మహితహృదయ పుటభేదనమై
కటకలితదానధారా
స్ఫుటకరకరటీసహస్రములఁ దనరారున్. 284

క. అందు వెలుగొందు నయనా
నందం బగు రాచనగరు నముచిభిదుపలా
మందపరిస్పందరుచిం
గ్రందుకొనినసౌధ మొకటిఁ గని యాలోనన్. 285

చ. చికిలికిరీటిపచ్చల రచించిన చిల్కలకోళ్ల నందమౌ
సకినెలపట్టెమంచమున శయ్యపయి న్సుఖనిద్రఁ జెంది యిం
చుక తనుఁ దా నెఱుంగకను జొక్కెడు తన్నృపు నల్లుఁడైన పెం
డ్లికొడుకు నేచి చూచి యవలీల మెయిం గడనుంచి యచ్చటన్. 286

తే. లీల మణిమండనుని బవళింపఁజేసి
కడకడల నుండునంతఁ దత్కటక మేలు
చారుచంద్రమహారాజచంద్రతనయ
కూర్మి మెఱయఁ గళావతీకోమలాంగి. 287

క. ఆరాత్రి పెండ్లి యగుట న
పారమహావిభవ మొప్ప బలవైరినిభుం