పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 71

తానపు డేపున “న్విపది ధైర్య మథాభ్యుదయే క్షమే"తి వా
ర్తానిపుణస్థితిం ధృతిధురంధరుఁడై యొకఁ డుండె నెమ్మదిన్. 278

తే. ఆదిగర్భేశ్వరుండైన యవ్విభునకు
మ్రానుపడి మేను బహుతరగ్లాని నొంది
కన్ను గూర్కెడునంత నగ్గహనభాగ
మేలు బేతాళుఁ డతిదుర్నిరీక్షుఁ డగుచు. 279

క. అనరప్రచార మమితం
బనుపమగాఢాంధకార మతిఘోరతరం
బనఁదగు మత్కాంతారముఁ
గననోపునె నుదుటఁ గన్నుగలవాఁ డైనన్. 280

వ. అని యనేకరోషనలజ్వాలాభీలవికటీకృతభ్రుకుటీలతాకుటిలవదనుం డగుచు నచ్చోటికిం గదసినతనిం గనుంగొని తదీయావయవంబులం గననగు సార్వభౌమముద్రికాముద్రితంబు లైన సాముద్రికంబుల నిరీక్షించి సకలశుభలక్షణలక్షితుం డితం డెవండో యని తనమనంబున వితర్కించుకొని స్వకీయానుచరులతో ని ట్లనియె. 281

ఉ. ఈసుకుమారదేహుఁ డిపు డీవని నుండ నుపేక్ష చేసినం
దోసము వచ్చు మీ రితనిఁ దోడ్కొనిపోయి చిరత్నరత్నశో
భాసమమైన యొక్కనృపహర్మ్యమునం బవళింపఁజేసి సం
త్రాసము చెందకుండఁ గొనిరండు ప్రభాతము వచ్చునంతకున్. 282

వ. అని నియోగించిన నంగీకరించి యతనిం గ్రహించుకొని తదీయపరిచారకు లాక్షణంబ శాంబరీవిడంబనంబునం గుకురు