పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


          నాసికారంధ్రనిశ్వాసధార-


గీ.

లమ్మహాదేవు లెంకలమైన మేము
భర్త యానతి నిర్వహింపంగఁ [1]దలఁప
మమ్ముఁ జీరికిఁ గైకోక మదము పేరిట
నెట్టు కొనిపోయెదరు విప్రు నెఱయఁగట్టి.

65


ఉ.

బుద్ధియ కల్లెనేని కొనిపోకుఁడు ధర్మము సూక్ష్మ [2]మీ యసం-
బద్ధములైన న్యాయములఁ బంతము వచ్చునె [3]మేము [4]దెంపుమై
యుద్ధము సేయఁజాలకయ యోహరిసాహరి నెంత చెప్పిన-
[5]న్నిద్ధరణీతలామరుని నీరు చలంబున మీకుఁ దక్కునే.

66


గీ.

ఎంత చెప్పిన విన[6]రేమి యీకు మాకు
హరుని యాజ్ఞ[7]య బలవంత మల్పమెట్టు
[8]చాక నొవ్వక మీరు మా కాఁకఁ జెడక
[9]యిద్ధరామరు మాకిప్పు డిచ్చు టొప్పు.

67


క.

నావుడును యమునిదూతలు
భావభవారాతి[10]ప్రమథవర్గముతోడన్
సేవకధర్మము తగవును
లావును బంతంబు [11]దృఢబలంబును మెఱయన్.

68


వ.

[12]ఇట్లని పలికిరి.

69


క.

చత్తుము చెఱఁబడుదుము కడు
నొత్తుము మీచేత నెట్టునుం దగవు మముం
బుత్తెంచిన పతిసన్నిధి
నుత్తర మెట్లిత్తు మాజ్ఞ యుపహతిఁ బొందన్.

70


సీ.

చర్చించి చూడుఁ డా చంద్రార్ధమౌళికి
          యమరాజు నిజభృత్యుఁ డౌనొ కాఁడొ
యభవుఁ డిచ్చినయట్టి యధికార మౌఁ గాదొ
          యముఁడు గూర్చున్న ధర్మాసనంబు
త్రిపురాసురాంతకు [13]దివ్యదేహము గాదొ
          [14]వేదస్మృతులు తత్త్వవిధిఁ దలంప
శిష్టరక్షయు దుష్టశిక్షయు శూలికి
          (ననుమతం బౌఁ గాదొ) యాత్మలోన


గీ.

నవకరము లెన్ని యన్నియు [15]నాచరించెఁ
బాపియగు విని నరకకూపమునఁ ద్రోచి
బాధ పెట్టంగవలసిన పట్టునందుఁ
బంతమే విడుఁ డంట యో ప్రమథులార.

71


ఉ.

చచ్చిననేమి మూర్ఛ (నర సచ్చిన)నేమి ప్రహారవేదనన్

  1. ?. దగదొ
  2. తా. మిట్లు
  3. తా. యేము
  4. తా. నగ్గలింపగా
  5. తా. న్నిద్ధరణీసురోత్తముని
  6. తా. నేమొ నేము మీకు
  7. తా. యు
  8. తా. చాల నొప్పక పరిభూతిఁ జటులపడక
  9. తా. యీ ధరాసురవరుని మాకిచ్చు టొప్పు
  10. తా. ప్రముఖ భటవర్గముతో
  11. తా. కడుఁ జలంబును
  12. తా. ఇట్లు వలికి
  13. తా. దివ్యాజ్ఞ యౌఁ గాదొ
  14. తా. వేదస్తుతులు
  15. తా. నాచరించి