పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గీ.

పద్మినీషండములనుండి పాసి చనియెఁ
గోకమిథునంబు లత్యంతశోకపరతఁ
దోన యేతెంచె భ్రమరసందోహ మపుడు
కంఠలోహార్గళంబుల కరణి [1]మొఱయ.

97


వ.

ఇవ్విధంబునం బ్రతీచీకర్ణపూరరక్తోత్పలంబును జక్రవాకచక్రవాళకులచక్రవర్తియునగు మార్తాండుండు లోకాంతరంబున కవతరించిన గ్రమంబున నంబరతటాకవికచకమలినిసంజ మంజుమంజిష్టాపరాగసౌష్ఠవంబు [2]సంధించెఁ గృష్ణాగురుపంకవల్లికల యుల్లాసంబు నుల్లసంబాడుచుఁ జిలుపచిలుప చీఁకటి సిద్ధవిద్యాధరనితంబినీజనంబుల చెక్కుటద్దంబులతోడం జరలాడె [3]సాంధ్యదేవార్చనా బలిపిండంబులుం బోలె గగనమండలంబున వెండి[4]తగడుఁ దెగడి క్రిక్కిఱిసి చుక్కలు వొడిచెఁ బురుహూతాంతఃపురపురంధ్రీవిలాసదర్పణంబు దర్పకుని [5]మాటుఁ బొంది చందురుం డుదయగిరిశృంగశృంగాటకంబునఁ [6]బటికంబు గుండు చందంబొందె నప్పుడు చండాల*(కుల)వరారోహ వాహకుం డెక్కి విడిచిన వారువంబుఁ గొదమయుం బోలె సంభోగంబునం దృప్తి చని తనివోవని కౌతుకంబున సుకుమారుఁ గౌఁగిటం జేర్చి యిట్లనియె.

98


ఉ.

అల్లదె వేఁటపల్లె యట నావల మా వెలివాడ యావలన్
భల్లనిపాతమాత్రమునఁ బర్వతనిర్ఝరసింధు వావలం
దెల్లని గోపురంబుల నతిప్రమదావహమైన రోహిణీ-
వల్లభమౌళిభామిని నివాసము (లా మహిత) ప్రదేశముల్.

99


గీ.

ప్రతిభ సతతంబుఁ గొల్తు రా భద్రకాళి
జగతి నేఁబదియాఱు దేశములవారు
దశదినంబులు సింహకేతనము నిలిపి
హూణభూమికి దైవ మీ యుత్పలాక్షి.

100


వ.

నీ వమ్మహాస్థానంబున వసియింపు మేను నీకు నాయావేళలఁ బరిచర్య [7]సేయుచు వంచన బయల్పడకుండ మెలంగెద సర్వకలావిశారదుండవైన నీకుం బ్రాకారగోపురద్వారవేదికా*(ప్రాకార)ప్రఘాణకుట్టిమహట్టసౌధవీథీవిటంకంబులం గావ్యగోష్ఠీపరిహాసకథా బిందుమతీభిత్తికాప్రహేళికాభావనసుభాషితశ్రవణంబు, వారవిలాసినీదర్శనంబు, వైతాళికస్తుతిపాఠకంబు, దురోదరక్రీడ, చిత్రకర్మంబు, వీణాస్ఫాలనంబు మొదలయిన వినోదంబులం [8]బ్రొద్దుపుచ్చం గలిగెడి వెండియు.

101


క.

వెలివాడకుఁ గడుఁ జేరువ
సెలయేటికిఁ బొరువు [9]తాళ్ళుఁ జిట్టీఁదులు నా-
వలఁ దఱచు భద్రకాళీ-
నిలయం బది లెస్స నీకు నెలవు వసింపన్.

102


గీ.

ప్రొద్దు వోకుండ [10]ముందటఁ బొదమ నీవు
కాళికాస్థానమునకు నీ [11]కాలిత్రోవ
విప్రగృహమున నీకు నే విందొనర్తు
ధర్మమిషమున నింటిపెద్దలకు జెప్పి.

103


వ.

(అని చండాలి) చెలికత్తెయుఁ దానును వేఱొక్కతెరువున నిజనివాసంబునకుం జనియె సుకుమారుడు చెఱువుకొమ్ము దాపలం బట్టుకొని విపినషండంబు నడుమఁగా బక్కణంబునకు దక్షిణంబు(న వెలివాడ) యొరసికొని పోయి [12]కాలిత్రోవం జని సెలయేఱు గడచి ముందట.

104
  1. ము. మెఱయ
  2. తా. నధిష్ఠించె
  3. తా. సంధ్యాదేవతార్చన
  4. ము. తగటు
  5. తా. మారటం
  6. తా. పటికంపుగుండు చందంబునుం బొందె
  7. తా. సేయుదు
  8. తా. ప్రొద్దుపుచ్చుచుండం గలిగెడు
  9. ము. త్రాళ్ళు
  10. తా. ముందరఁ బొదము
  11. తా. కాలుద్రోవ
  12. తా. కాలుద్రోవ