పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వేణుస్వానంబు వేనవేల్ చందములన్.

60


వ.

అని చండాలకన్యక పలికిన నవ్విప్రుండు భవితవ్యతాబలంబున.

61


సీ.

ఇది యసజ్జనగోష్ఠి యిది [1]మోహవిలసితం
          బిది [2]మహాపాతకం బిది యకీర్తి
యిది దుర్మదాంధత్వ మిది [3]కామవిక్రియ
          (యిది యాగ్రహావేశ) మిది కుదృష్టి
యిది నారకద్వార మిది ప్రమాదస్థలం
          బిది మౌర్ఖ్యకారణం బిది యనియతి
యిది యధర్మముత్రోవ యిది [4]పథప్రచ్యుతి
          యిది యధోగతిహేతు విది యకృత్య-


గీ.

మని విచారింప కవనీసురాధముండు
కలికి చండాలకన్యపైఁ గన్ను వైచెం
దీయతీయనివింట లేఁదేఁటినారి
శంబరారాతి మోహనాస్త్రంబు [5]దొడుగ.

62


వ.

[6]అప్పుడతండు నిజాంతర్గతంబున.

63


సీ.

మాంసంబు భక్షింప మనసు వెట్టిననాఁడ
          దాక్షిణ్యగుణము [7]విధ్వంసమయ్యె
గంజాయిఁ దినఁగ నుత్కంఠ చేసిననాఁడ
          లజ్జాభిమానంబు లుజ్జగిల్లె
హాలారసము గ్రోల నభిలషించిననాఁడ
          సూనృతోక్తుల సుద్ది చూఱవోయెఁ
బరకళత్రముల[8]పైఁ బడఁదలంచిననాఁడ
          ప్రజ్ఞావిలాసంబు పదటఁ గలసె


గీ.

నింక నేటికి వంచింప [9]నిలుపు నాకు
బరువె యీ పాపములలోనఁ బాపమొకటి
వరుస వేయింటిమీఁద జవ్వాదికొమ్ము
తివుటఁ జండాలకన్యకఁ గవయువాఁడ.

64


వ.

అని పరమసాహసంబు చేసి సుకుమారుండు చండాలకన్యకం జేరవచ్చి యిట్లనియె.

65


కవిరాజవిరాజితము[10].

సరసిజలోచన యొక్కమహాముని శాపవశంబునఁ బాణచివై
ధర జనియించినదానవు నీవిది తథ్యము కిన్నరభామినివో
గరుడపురంధ్రివొ [11]ఖచరవధూటివొ గాని జఘన్యవు గావిఁక నన్
ధరణిసురోత్త[12]ము దగ వరియింపు సుధాకరసూర్యులు సాక్షులుగాన్.

66


వ.

సామాన్యస్త్రీజనంబుల కిట్టి యమానుషలోకోచితంబులైన సౌభాగ్యంబు[13]లుం గల్గునె మునికోపవశంబున సముజ్ఝితదివ్యశరీరలగు దేవ[14]కాంతలు శాపవశోపనీతంబైన శరీరంబు నధిష్ఠింతురు తొల్లి [15]స్థూలశిరుండను మహాముని త్రిభువనలలామభూతయగు రంభ నేదేని యొక్కనిమిత్తంబున శపించెననియును దచ్చాపంబున నయ్యప్సరస

  1. తా. యసమ్మతదృష్టి
  2. తా. మోహవిలసితం
  3. ము. యాగ్రహావేశ
  4. తా. పద
  5. ము. దొడిగి
  6. ము. ఏయునప్పుడు
  7. తా. విధ్వస్తమయ్యె
  8. ము. వెంబడ
  9. తా. నిలువ
  10. [AB. దీని ఛందస్సు హరిగతి రగడకు దగ్గరగా వుంది. కవిరాజవిరాజితము కానేరదు.]
  11. ము. యక్ష
  12. ము. ముని న్వరియింపు
  13. తా. లు గలునేర్చునె
  14. తా. తాంగనలు
  15. తా. స్థూలశరీరుండను