పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సౌందర్యవిలాసవిభవ[1]సర్వజ్ఞనిధీ.

53


వ.

నిన్నుం జూచి సుఖామృత(హ్రద)ంబున మునింగిన చందంబున [2]రతిసముద్రంబును దేలిన విధంబున [3]సర్వానందంబుల కుపరిభాగంబున వర్తించు కరణి సకలమనోరథంబులకు సంకేతంబైన లాగున నా హృదయంబు నిర్వృతిం బొందియున్నయది.

54


ఉ.

క్రొన్ననవింటిజోదు నలకూబరు నైషధునిం జయంతునిం
బున్నమనాఁటిచందురునిఁ బోలినవాఁడవు రూపసంపదన్
నిన్నొకవిప్రుఁగాఁ బరిగణింపఁగవచ్చునె కల్లగాదు మా
యన్నల[4]తోడు చూడు పులకాంకురముల్ మొలచెం గుచంబులన్.

55


గీ.

అవనిసుర చింతకాయల కాజ్ఞ గాక
యరసిచూడంగ గ్రుక్కిళ్ళ కాజ్ఞ గలదె
యంటరాకున్న నేమి యంతంత నిలిచి
చిత్తమలరంగ నిన్ను వీక్షింపరాదె.

56


సీ.

కమలినీపత్ర[5]పాత్రములఁ గాసారోద-
          కముఁ దెచ్చి పాదపద్మములు గడుగఁ
జిలుక ముట్టని ఫలంబులు గోసికొని వచ్చి
          పరికించి యారగింపంగఁ బెట్టఁ
గాంతార[6]కర్పూర కదళికాదళముల
          సరసరీతులను వీజన మొనర్ప
నధ్వఖేదము వోవ హస్తద్వయంబున
          నూరుకాండము లొత్తి యుపచరింప


గీ.

వేడ్క[7]యయ్యెడు వినయంబు విస్త[8]రిల్ల
[9]భక్తి గొనఁసాగఁ బ్రమదంబు పారమేద
నీకు విప్రోత్తమునకు నీ నెలవులందుఁ
జెట్టదుర్జాతి యది నన్నుఁ జెఱిచెఁ గాని.

57


క.

ఇది హూణమండలం [10]బ-
వ్వది నున్నది చెంచుపల్లె వనమధ్యమునన్
మదననిభ యీ పుళిందా-
స్పదంబు వెలివాడ (జన్మసదనము నాకున్).

58


తాళ రగడ.

కనుఁగొనవలయును దౌదవ్వుల నెడ[11]గలిగి నిలిచియైనను మా యిండ్లన్
వనమధ్యంబున విప్రోత్తమ వెలివాడవనితలకు నేత్రోత్సవమై
యనిభృతపరభృతనఖ(శిఖరోల్లిఖితాంగణ)సహకారద్రుమశాఖా
ఘనఫలరసధారామృతపానోత్కంఠవివృత్తాననవటుకంబున్.

59


క.

[12]పాణసివారము కమ్మని
ప్రాణము నెఱజాణదేవరా వినవలదా
వీణావాద్యముఁ బాటయు

  1. ము. సర్వస్వ
  2. ము. నతి
  3. తా. సర్వానందంబు లుపరి
  4. ము. యాన
  5. ము. పుటముల
  6. తా. కల్హార
  7. తా. యయ్యెడి
  8. తా. రింప
  9. ము. భక్తిగొనఁగఁ బ్రమోదంబు పారమేదు
  10. తా. బి
  11. ము. గలుగ
  12. తా. పాణచి