పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

కొలనిదరి వటమునీడన్
శిలతల్పమునందుఁ గొంతసేపు శయించెం
జెలువమగు వలిపెదుప్పటి
తలగడఁగాఁ జేసి సచివతనయుం [1]డంతన్.

25


గీ.

బహులపక్షక్షపాకదంబములలోనఁ
బ్రభవ మొందిన యంధకారంబువోని
కొలనిదరి కాననంబులోఁ గొంత[2]ప్రొద్దు
నలపు వాయంగ నిద్రించె యాజ్ఞదత్తి.

26


గీ.

[3]డప్పి దీఱంగ మధురకాండంబు గ్రోలి
కడుపునిండంగఁ [4]దూఁడుఁదీఁగలు భుజించి
యెండ వాలారునందాఁక నిండుకొలని
తీరమున మఱ్ఱినీడ నిద్రించె నతఁడు.

27


చ.

అపుడు విలంబమానమయి యంబరకోణతటాంతరంబునం
దపనునిమండలంబు బెడిదంబగు వేఁడిమి వే నొయ్య వీడ్కొనెం
గపిలములై మయూఖములు కార్తికమాస[5]కళాపచేళిమ
త్రపుసలతాశలాటుసముదాయముచాయఁ దిరస్కరింపఁగన్.

28


గీ.

అంత[6]లో నిద్ర మేల్కాంచి యవనిసురుఁడు
జిగమిషాబుద్ధి [7]నీక్షించెఁ జిత్రభాను
నభినవోన్మేషకుటిలజిహ్మప్రకార-
లోలతారకాకేకరాలోకనమున.

29


శా.

కాంతారాంతరభూమిచెంత శబరగ్రామంబు పద్మాకర-
ప్రాంతక్షోణితలంబునం గలుగ [8]సంభావించె విప్రుం [9]డెదన్
దంతిస్కంధకపోలకుంభపలలాదక్రూరకౌలేయకీ-
[10]సంతానాస్ఫుటకంఠఘర్ఘరతరద్రాఘిష్ఠనాదంబులన్.

30


వ.

(ఆ సమయంబున).

31


సీ.

ఆదికాలమున మాయావిలాసినియైన
          మురదైత్యదమనుని మూర్తి వోలె
ధరణితలంబునఁ జరియింప నేర్చిన
          పురుహూతమణిశిలాపుత్రి వోలెఁ
గామినీరూపంబుఁ గైకొన్న శంబరా-
          రాతి కాలాయసాస్త్రంబు వోలె
వేడ్కకె మానుషీవిగ్రహంబు ధరించి
          విహరించు తొలుకారువేళ వోలె


గీ.

నంధతామిస్రమును నవిద్యయును బోలె
భువనమోహనరూపవైభవము [11]లొలయ

  1. ము. డలఁతన్
  2. తా. వేళ
  3. తా. దప్పివోవంగ మధురోదకంబు గ్రోలి
  4. తా. దొండితీగలు
  5. ము. కలాపి పింఛమై
  6. తా. నా నిద్రమేల్కని
  7. తా. వీక్షించె
  8. తా. సంభావించి
  9. తా. ఎడన్
  10. ము. సంతాన
  11. తా. వొలయ