పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ర్భరకరుణాధురీణయగు ప్రాణముప్రాణము తల్లియున్న దే
హరహర యెవ్వరింకఁ గడుపారని పెట్టెద రీప్సితాన్నముల్.

19


వ.

అని తనలోనం దలపోయుచుం జనిచని ముందట.

20


సీ.

స్ఫటికరత్నగృహంబు సర్వంసహాకాంత
          కభిధాంతరంబు దుగ్ధాంబునిధికి
మణిదర్పణము నభోమణిమార్గలక్ష్మికిఁ
          జంద్రాతపమునకు జన్మభూమి
యర్ధేందుమకుటాట్టహాసంబునకు జోడు
          పౌలస్త్యగిరికి సబ్రహ్మచారి
ప్రతిబింబ మభ్రముప్రభువారణమునకు
          ననుఁగుఁజుట్టము శారదాభ్రములకు


గీ.

గమఠతిమినక్రవిక్రమక్రమవిహార
చటులతరవీచికాఘటా[1]సమధిరూఢ
హంసకులసన్నినాదసంవ్యాప్తదిగ్వి-
భాగ మీక్షించె నతఁడు తడాగ మెదుర.

21


మ.

వసుధానిర్జరుఁ [2]డమ్మహాసరసిలో వార్వీచులం దేలెఁ ద్రా-
వె సుధాసన్నిభమైన వారిఁ దటపృథ్వీజావళిచ్ఛాయ[3]లన్
వసియించెన్ లహరీసమీరముల నధ్వశ్రాంతి పోకారిచెన్
బిసకాండంబులు [4]మేసెఁ గూర్చెఁ జలువల్ నిర్మోకసంకాశముల్.

22


క.

కరశీకరార్ద్రపుష్కర-
కరుఁడై యాతండు గంధకరిరాజు క్రియం
[5]బరిషేకానంతరమునఁ
సరసిరుహాకరము వెడలి చాలఁగ నొప్పెన్.

23


సీ.

వైదూర్యమణిశిలాస్వచ్ఛోదకము గానఁ
          గౌతుకం బొనరించెఁ గన్నుఁగవకు
[6](శిశిరసంస్పర్శవీచీమారుతము గాన
          నంగకంబులకు నిం పావహించెఁ
మలకేసరరేణుగంధోల్బణము గాన
          ఘ్రాణేంద్రియమునకుఁ బ్రమద మొసఁగె
గలహంసకులకలకలకలకులాయము గాన
          శ్రుతిసంపుటములకు సుఖమునిచ్చె)


గీ.

(మధుర)సలిలంబు [7]గాన సమ్మదముఁ జేసె
నాలుకకు నప్పు డవనిబృందారకునకు
సైకతారూఢజలమానుషీకదంబ-
కాంక్షితార్కమయూఖంబు కనుల నరసి.

24
  1. ము. సమద
  2. (తాళపత్రములో) ఈ పంక్తులకు చాలినంత స్థల మూరక విడిచియున్నది.
  3. ము. డున్మహా
  4. ము. లో
  5. తా. మేసె గుంజె వలువల్ నిర్మోక; ము. మేనఁగూర్చె క
  6. ము. సమ్మోదమునను జేసె
  7. ??