పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గీ.

నీ మహత్త్వంబు వర్ణింపనేర మేము
నిన్నుఁ దెలియంగనేరము నిజముగాఁగ
నభవ యాద్యుండ [1]వాఢ్యుండ వగుదుగాన
నట్టి నీ కాచరింతు ముపాస్తి యెపుడు.

109


గీ.

పశువులము [2]మేము హర పశుపతివి నీవు
పశువులకు నెక్కడిది బుద్ధి ఫాలనయన
రాజ శేఖర నేర్పు నేరములు చూడ-
కరసి రక్షింపు మమ్ము నత్యంతకరుణ.

110


గీ.

విష్ణుమూర్తులు [3]కడచన్న వేళలందు
నజునిమూర్తులు [4]కడచన్న యవసరమున
[5]జిష్ణుమూర్తులు పర్యవసించినపుడు
[6]కలదె నీకు నపాయంబు కాలకంఠ.

111


గీ.

అమరవంద్య దివాభీత మనెడి పులుఁగు
హేళిమండల మీక్షింప నెట్లు నేర్చు
నేము [7]నిన్ను బరీక్షింప నెంతవార-
మిమ్మహాపరాధము క్షమియింపవలయు.

112


వ.

అని స్తుతియించినం బ్రసన్నుండై విరూపాక్షుం డాక్షణంబ లింగమధ్యంబున వెడలి యర్ధనారీశ్వరుండును ద్రినేత్రుండును నీలలోహితుండును వరదాభయ[8]మృగధరుండును సర్వాభరణభూషితుండును బ్రమథగణసమన్వితుండును గోటిసూర్య[9]ప్రకాశుండును బాలచంద్రావతంసుండునునై సన్నిధియగుటయుఁ బెన్నిధిఁగన్న పేదల *(విధంబుం) బోలి విరించినారాయణు లిట్లనిరి.

113


సీ.

ఇభచర్మపరిధాన యే భక్తి చేసిన
          సంతసంబందు నీ యంతరంగ-
ముడురాజమౌళి యే యుపచారములు నీకుఁ
          బ్రియములై యుండు నెంతయును గరిమ
నగరాజకన్యకాప్రాణేశ నీకు నే
          కెలనఁ బో సర్వాంగకృప జనించుఁ

  1. తా. వైతివీ
  2. తా. నేము
  3. తా. గడసన్న
  4. తా. గడసన్న
  5. ము. విశ్వమూర్తులు విబుధులు వెడలునపుడు
  6. ము. కలదు నీ కనపాయంబు
  7. ము. నిను వినుతింపఁగ
  8. ము. మృగాంకధరుండును
  9. తా. ప్రతీకాశుండును