పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


శిశిర మగునేని వణఁకును సీతువట్టి.

104


సీ.

అద్భుతం బందిరి హరియుఁ బద్మభవుండుఁ
          దమలోని తీవ్రరోషములు మాని
పుష్కలావర్తకాంభోధరవ్రాతంబు
          గురిసెఁ గల్పకలతాకుసుమవృష్టి
జయజయధ్వనులతో సనకాది యోగీంద్రు-
          లభినుతించిరి ప్రస్ఫుటాక్షరముల
నమరదుందుభినినాదములు దిక్కుల నిండె
          గంభీరతరమహాఘనరవముల


గీ.

నడఁగె నస్త్రద్వయంబు నభ్యంతరమున
[1]నగ్గికంబంబులోఁ గాన[2]నయ్యె శివుఁడు
వలిపె తెరలోననున్న భావంబు దోఁప
మాఘకృష్ణచతుర్దశీమధ్యరజని.

105


గీ.

హంసరూపంబు దాల్చెఁ బద్మాసనుండు
దంష్ట్రిరూపంబు గైకొనె దనుజరిపుఁడు
పోయి రంబరమున కధోభువనమునకు
నూర్ధ్వమును గ్రిందుఁ గానంగ నుత్సహించి.

106


క.

బహువర్షసహస్రంబులు
ద్రుహిణుండును హరియు [3]నధ్యధోభువనములన్
బహులక్రియ శోధించిరి
దహనస్తంభంబు తుదయుఁ దన్మూలంబున్.

107


వ.

శోధించి యాద్యంతంబులు పొడగానక హరివిరించు లేతెంచి వామదక్షిణభాగంబుల నిలిచి జగత్కారణంబయిన యమ్మహాదేవు నిట్లని స్తుతియించిరి.

108


సీ.

[4]శర్వ లోకాధీశ చంద్రార్ధశేఖర
          పురుష పురాణ శంకర మహేశ
యభవ యంతర్యామివై [5]ప్రేరకత్వము
          చేపట్టి జనుల శాసింతు [6]వీవు
భవదీయమాయాప్రభావంబు కతమున
          నెఱుఁగలేమైతిమి యేము నిన్ను
మాకుఁ గర్తవు నీవు మాకు భర్తవు నీవు
          మాకు హర్తవు నీవు మాటలేల

  1. తా. నగ్నికంభంబు
  2. తా. బడియె
  3. తా. దివియధో
  4. తా. సర్వ
  5. తా. ప్రేరకత్వంబు
  6. తా. వీవ