పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గీ.

సప్తపాతాళముల క్రిందఁ జాఁగిపడిన
యవని నెత్తె నిశాతదంష్ట్రాంకురమున
నభినవస్తబ్ధరోమదివ్యావతారుఁ
డంబురుహలోచనుండు కల్పాదియందు.

67


వ.

ఇవ్విధంబున మహాపర్వతసన్నిభంబును *(నీలమేఘప్రతీకాశంబును దంష్ట్రాదండదారుణంబును విపులవృత్తఘనస్కంధంబును సమున్నతకటితటంబును హ్రస్వవృత్తోరుజంఘాగ్రంబును దీక్ష్ణఖురమండలంబును బద్మరాగసదృశేక్షణంబును దృఢదీర్ఘమహాప్రోథంబును సముదీర్ణోచ్ఛ్వాసనిశ్వాసవిఘూర్ణిత ప్రళయార్ణవంబును) విద్యుచ్ఛటాపాటల *(సటా)చ్ఛన్న కపోలస్కంధబంధురంబును[1]నయిన వరాహరూపం బావహించి రసాతలంబున సలిలమగ్నయగు పృథివి నుద్ధరించిన.

68


గీ.

దానవారాతిదంష్ట్ర నెత్తంగఁబడిన
[2]యుర్వి సూపట్టు జలధి నీ రోడి(గిలఁగ
పసిఁడికామ హత్తించిన పంబుతోడి
క్రొత్త) వెలిపట్టు జగజంపు గొడుగువోలె.

69


సీ.

జయజయధ్వనులతో సనకాది మునికోటి
          వేదాక్షరంబుల వినుతి సేయ
బహుళసౌరభ(పరంపర) లుప్పతిల్లంగ
          విద్యాధ(రులు పుష్పవృష్టి) గురియ
దివ్యదుందుభిసముత్థితనినాదంబుల
          (భువననిష్కం)భంబు బోరు కలఁగ
జోకయై యప్సరస్సుదతీకదంబంబు
          నింగిమీఁదఁ బ్రమోదనృత్త మాడ


గీ.

జద్దువడి యుండె నొక కొంత ప్రొద్దు వేడ్క
నవయవంబులు గరుదాల్ప నచ్యుతుండు
ప్రళయజలనిధి క్రింద (లోబ)డినయట్టి
యుర్వి దంష్ట్రాంకురంబున నుద్ధరించి.

70


గీ.

సురలు తనమీఁదఁ బువ్వులసోన గురియఁ
జూడ నొప్పా[3]రె హరి [4]శఠక్రోడమూర్తి
కందరంబుల ఖద్యోతగణము మెఱయఁ
జాల నొప్పారు నంజనాచలము వోలె.

71
  1. తా. నై
  2. ము. తా. సుట్టును
  3. తా. రు
  4. తా. శ్వేత