పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మాలతినాఁగ సుబాలికనా బల-
          [1]ప్రమథినినా వికరాళి యనఁగ
కాళరాత్రి కరాళికా ప్రచండులనాఁగ
          బ్రాహ్మ్యాది మాతృకాపరికరంబు
పార్వతి ప్రముఖబల ... ... ... ... ... ...
          ప్రమథనాధిక భూతపరికరములు


గీ.

ప్రమథవర్గంబు లయకాలభైరవుండు
పాశుపతములు చండకోపప్రచండ
చండచండార్చులును ఘోరశారభముల
శివుని పడమటి యెడ నిరీక్షించె యముఁడు.

17


వ.

శంఖచక్రధరుండును పీతాంబరుండును గౌస్తుభోద్భాసితవక్షఃస్థలుండును గిరీట కటక హార నూపుర గ్రైవేయ కంఠికాది నానావిధ దివ్యాభరణభూషితుండును లక్ష్మీసహాయుండునునై పురాణపురుషోత్తముండును, నష్టవసువులును, ద్వాదశాదిత్యులును, సిద్ధ విద్యాధర గంధర్వాక్షీణ యక్ష భుజంగ గుహ్యకులును మొదలుగాఁ గలవారును మఱియునుం గలవారల హరుని యుత్తరదిక్కునం గాంచి వైవస్వతుం డద్భుతంబందుచు నభ్యంతరమందిరంబు ప్రవేశించి.

18


సీ.

వేదోక్తమగు క్రియావిధిఁ బాశుపతమహా-
          వ్రతదీక్ష గైకొన్న వ్రతులఁ జూచె
విచ్ఛిన్నపాశులై విరహితద్వంద్వులై
          విమలాత్ములైన యుత్తములఁ జూచె
[2]నద్వైతతత్వవిద్యారహస్య జ్ఞాన-
          సంపన్నులగు యతీశ్వరులఁ జూచె
నిగమాంతవివిధోపనిషదర్థ వాసనా-
          ఘనులైన యోగిపుంగవులఁ జూచె


గీ.

దివ్యసింహాసనాసీనుఁ ద్రిపురహరునిఁ
[3]బర్వతోద్భవాపరిపూర్ణపార్శ్వభాగుఁ
గాలకంఠునిఁ జంద్రరేఖాకిరీటు
శ్రీమహాదేవు నభవు వీక్షించె యముఁడు.

19


వ.

వీక్షించి దండప్రణామంబు చేసి నిలిచి చేతులు మొగిడ్చి మహేశున కిట్లని స్తుతించె.

20


తాళ రగడ.

జయజయ సచరాచరసర్వజగత్సర్గస్థితిసంహారతిరోభా-
          [వా]నుగ్రహలీలాపంచవిధవ్యవహారవినోదైకపరాయణ
జయజయ హాటకగర్భకిరీటస్థాపితబహువిధమణిఘృణిపటల-
          వ్యతికరకిమ్మీరిత[4]పాదాబ్జద్వంద్వపీఠికోపాంతవసుంధర
అహరహ [5]రహమహమిక యా త్వా మభివందే పృథుగోధివీథికా-
          దృగ్ధూమధ్వజజిహ్వా[6]రంహోమృత్కణాయమానప్రసవాయుధ
మహిమానం తవ కో వా స్తోతు[ం] ప్రభవతి విషనిధివిషకల్మాషిత-
          కంఠమూలకంఠోక్తాశేషజగత్సంరక్షాదాక్షిణ్యక్షమ

  1. తా. ప్రమథిసేనా
  2. తా. అద్వెతతత్వవేదద్వయరహస్యజ్ఞాన
  3. తా. బర్వతోద్భవాపూర్ణుం బార్శ్వబాగు
  4. తా. పాదాంభోరుహద్వంద్వపీఠికోపాంత
  5. తా. మహమేకయా
  6. తా. రహస్త్యకణాయమాన