పుట:శివతత్వసారము.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గురువు హస్తమస్తకసంయోగ మొనరించి చిత్కళాన్యాస మొనరించినంతనే భౌతికశరీరము లింగశరీరముగ మాఱుటచే మంత్రవిశిష్టమగు మఱియొకజన్మ శిష్యునకు గలుగును – దీని ననుసరించియే శైవసంప్రదాయమున శిష్యులు- గురుహస్తజాతులమని వ్యవహరింపబడుచున్నారు.

153. జంగమలింగంబగు భ
    క్తుఁ గనిఁ బూజింపఁడేని గోటివిధమునన్
    లింగార్చన చేసిన వృథ
    జంగమ ముత్తమము గాగ స్థావరమునకున్.

జంగమలింగమనగా చరలింగము; జీవిరూపమున చరించు శివుడు - శివభక్తుడు.

220. గురుకృతశివదీక్ష మెయిన్
    విరహితమలదేహులగు పవిత్రులు భక్తుల్
    హరనిర్మాల్యము గుడుతురు
    శివశాస్త్రపురాణవచనసిద్ధాంతగతిన్.

ఇచట ప్రసాదస్థల వివరణ గలదు.

నాల్గవ పాదమున శివశాస్త్రపురాణవచనము లివి.

సీ. ఆది "రుద్రేణాత్మ మశ్నంతి రుద్రేణ
                పీతఁపిబంతి" "ప్రఖ్యాతి శ్రుతుల
    నన్నిగమాంతర" మతికిల్బిషంస్యా 'ద
                నర్పితం' బనెడు సిద్ధాంతములును
    నవికలసిద్ధాంతనివహోక్తి" లోభాన్న
                ధారయేత్త'ను శివధర్మములను
    శివధర్మశాస్త్రదృష్టిఁ బ్రసాద మేవ భో
                క్తవ్య"మను పురాణకాండములను
ఆ. సిద్ధమనుచు వేదసిద్ధాంతశాస్త్రపు
    రాణతతుల మలహరప్రసాద
    మహిమఁ దెలిపినట్టి మల్లికార్జున పండి
    తయ్యగారిఁ దలఁతు ననుదినెబు.

అనుభవసారము—9 పద్యము.