పుట:శివతత్వసారము.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ కారణము చేతనే సోమనాథుడు, తాను ఈశ్వరకులజుడనని పార్వతీపరమేశ్వరులు తలిదండ్రులని చెప్పుకొన్నాడు.

129. శివభక్తులకు జాతాశౌచ మృతాశౌచములు లేవు.

133. కమ్మగవలచిన = మంచి వాసన వేసినట్లుగా

144. భక్తియే ప్రధానముగ నెంచి, గురువు యొక్క ఆజ్ఞాప్రకారము వర్తింపక, అన్యవిధమున గొప్పభక్తుడై, తనభక్తిని గనిపఱచినయెడల, గురు వాశిష్యునిపై గోపింపక తనశిష్యు డంతవా డాయెనని సంతోషించి, పరవశుడై, ఆ భక్తశిష్యుని తప్పు మఱువవలయును.

150. భక్తి కనుదేహభావవ్యక్తుండు. శివుడు భక్తుని యనుదేహము అనగా ప్రతిదేహము అను భావన.

187. వుచ్చినకన్ను అనగా పెఱికిన కన్ను

194. శివభక్తి లేని బ్రాహ్మణుడు శ్వపచునకు గీడు, అనగా అంత్యజాతివానికన్న తక్కువవాడు.

197. శివుని కృపలేని వైభవము క్షణభంగురము. దీనికి రెండుదృష్టాంతములు చెప్పబడినవి.

1. మెఱియలపై [1]పిండకూడు.

మెఱియ యనగా గుండ్రాయి - దినవారములు చేయునపు డొకరాతియందు ప్రేత నారోపించి, దానిమీద నీళ్ళు పోసి, తిలలు దర్భలు మొదలైనవి వేసి దానికే పిండములు పెట్టుదురు. ఆ రాతివైభవ మాదినవారములు పదిరోజులే. ఆవెనుక ఆరాయి విసర్జింపబడును.

2. మీస మెదుకుల మెఱపులు. భోజనము చేయునవుడు కొంచెముకాలము మెదుకులు మీసములపై నుండి, భోజనానంతరము ముఖము కడుగగానే అవి జారిపోవును. క్షణకాలమే వానివైభవము.
  1. దీనినే వ్యవహారములో 'పిండాకూడు' అని యందుము.