పుట:శివతత్వసారము.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఎడపక పూజాంతమునన్
చిడిముడిపడి [1]ఘర్ఘరములు సెలఁగఁగ నీ వె
ప్పుడు మెచ్చి భక్తి కాడుదు
వడిఁ [2]జేరమ చక్రవర్తి వాయింప శివా!

443


క.

నమ్మిన భక్తుఁడు గన్నడ
బమ్మయ సద్భక్తి మహిమ పరికింపఁగ లో
కమ్ములఁ జోద్యము గాదె! య
[3]ధర్మంబును ధర్మమయ్యెఁ దత్త్వాతీతా!

444


క.

పరువడి మఱియు ననేకులు
ధర బాణ మయూర కాలిదాసాది మహా
పురుషులు దృష్ట ప్రత్యయ
వరములు నినుఁ గొలిచి కనిరి పరభక్తి శివా!

445


క.

వలయునని దేవ! కొందఱ
నెనకొని పేర్కొంటిఁ గాక నీచేత వర
మ్ములు వెలయఁగఁ బడగిన భ
క్తుల కొలఁ దెఱుఁగుదు ననంగఁ గొలఁదియె నాకున్.

446

భక్తి మహిమ

క.

మహిలోఁ గేవల భక్తి వి
రహితములై చేయబడి కరంబును దుఃఖా
వహమై దక్షుఁడు సేసిన
విహితక్రియ లెట్టు లట్ల విఫలంబు లగున్.

447


క.

నీ పదభక్తుఁడు సేసిన
పాపంబుం బుణ్యమగు నభక్తులు సేయన్

  1. ఘుర్ఘరవము?
  2. నేరమ?
  3. ధర్మంబున్