పుట:శివతత్వసారము.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

కూడి జగమెల్ల నోపక
యోడిన శివభక్తి మహిమ యుత్కృష్టముగా
నేడర బంకయ చూడఁగ
దేడరదానయకుఁ దలుపు దెఱవవె రుద్రా!

420


క.

శంకర! నీ కింకరుఁ డ
భ్రంకషముగ నేత్రవహ్నిఁ బరదైవములన్
బొంక మడఁగింపఁడే! భువి
శంకరబాదాసయ్య నీ ప్రసాదమున శివా!

421


క.

కడవఁగ నేరక మ్రొక్కిన
నడుమప్పుడు [1]డుస్సివడ జినప్రతిమ మహిన్
బడియందు వైజకవ్వకుఁ
బొడసూపవె! లింగమూర్తిఁ బుగహర! దయతోన్.

422


క.

కడిచేసి వెట్టగాఁ గొని
సడిసనఁ గటకమున సురియ చముడయగారిన్
గడుఁ గరుణించి జగమ్ములు
గెడఁగూడి నుతింప నారగింపవె! రుద్రా!

423


క.

తా ముందరఁ జని సూచిన
యామాంసము నీకుఁ బెట్టి యతిశయభక్తిన్
వ్యామోహంబున నీదయ
గా ముక్తికిఁ జనఁడె! యెఱుక గన్నప్పఁ డజా!

424


క.

భావనయ భక్తి నీకును
భూవినతుఁడు మేలు కబ్బములు సెప్పి మహా

  1. వ్రస్సి