పుట:శివతత్వసారము.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బరఁగిన గణనాయకుఁడొకఁ
డరు దెవ్వరికైనఁ బొగడ నక్కజుఁడు శివా!

350


క.

ఒండేమి సమస్తబ్ర
హ్మాండంబులుఁ బూనపేరులై యుండఁగ ను
ద్దండగతి గ్రుచ్చి యాడఁగ
నండాభరణుఁడన నెగడె నతిబలుఁడు శివా!

351


క.

వెండి హరి బ్రహ్మాదుల
రుండము లాభరణములుగ.......
రుండాభరణుఁడు నా నధి
కుండు భవద్గణవిభుండు గురుభుజుఁడు శివా!

352


క.

వెండియు నానాకారులు
వెండియు నానాప్రతాపవిక్రమవిభవుల్
దండితదైత్యేంద్రులు వర
[1]గుండప్రియ! నీ గణములు గొందఱు రుద్రా!

353


క.

లాలాసుర వక్షస్స్ధల
కీలాల జలప్రవాహకేళీలోలా
భీలత్రిశూలహస్తులు
హాలాహలాంకులు భవద్గణాధిపులు శివా!

354


క.

రాజార్ధధరులు నరసుర
రాజామరభయులు రాజరాజసఖులు గో
రాజపతాకులు గేశవ
రాజప్రియ! నీగణములు రాజాభరణా!

355
  1. గొండప్రియ