పుట:శివతత్వసారము.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

కుమ్మరి దరిగొల్పిన చి
[1]చ్చుమ్ముల నావమ్ము కడవ [2]లుల్ల దరికొనం
గ్రమ్ముగతి నజాండంబునఁ
బ్రమ్ము భవన్నేత్రవహ్నిప్రళయమున శివా!

323


క.

భవదుద్భట నిటలేక్షణ
భవజృంభిత [3]విలయవహ్నిపర్వి జగద్వి
ప్లవహేతువయ్యె బ్రమథుల
కవిరళసుఖహేతువయ్యె నదియె మహేశా!

324


క.

లోకంబులు ప్రళయాగ్నిశి
ఖాకలితములై తదగ్నిఁ గాలఁగఁ బ్రమథా
నీకములు వెరిగి యాడు మ
హాకౌముదిఁ దేలియాడు నట్లు మహేశా!

325


క.

త్ర్యంబక! నీ ప్రమథగణా
డంబరవిభవంబు గడు నొడంబడ సంహా
రంబును వర్ణన సేయఁగ
లంబోదర షణ్ముఖాదులకు నరిది శివా!

326


క.

ససముద్రద్వీపాచల
వసుమతి వడి మీఁది కెగురవైచి సనక్ష
త్రసురావాసాకాశము
వెనఁ గ్రిందికిఁ దివుచుఁ బ్రమథవిభుఁడొకఁడు శివా!

327


క.

కడు మండెడు బడబాగ్నిం
దడయక వడి గూడఁ దిగిచి తననుదుటను బొ

  1. చ్సిమ్ముల
  2. లెల్ల దరికొనం
  3. నిటల