పుట:శివతత్వసారము.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దిక్కెఱిఁగిన దృఢభక్తుఁడు
పక్కండెవ్వరికిఁ గార్యభారమున శివా!

163


క.

భూచలము తల్లడిల్లినఁ
బాతాళము బయలువడ్డ బ్రహ్మప్రళయం
బేతెంచిన నీ భక్తుఁడు
చేతులు ద్రిప్సకయ పూజ సేయును రుద్రా!

164


క.

వేయేటికిఁ బ్రాణంబులు
వోయినఁ దమతలలు తెగిన భువిభక్తులు ని
న్నాయతమతి నభ్యర్చన
సేయక కుడువరు ద్రిలోకసేవితచరణా!

165


క.

ఆయుధములుఁ గుసుమము లగు
నాయబ్టులు మెట్టలగు మహామదగజముల్
వేయేల గండశిలలగుఁ
బాయక నినుఁ గొలుచు నచలభక్తులకు శివా!

166


క.

అధమము నత్యుత్తమ మగు
నధర్మమును ధర్మ మగును నాగమనిధి స
ద్విధి యగు నిషేధమునుఁ జం
ద్రధరా! భవదీయభక్తితాత్పర్యులకున్.

167


క.

క్షుత్తృష్ణాది విపత్తులు
[1]బత్తళి జలతపనశీతవాతాదులును నే
ద్వృత్తగతిఁ బొంద వెఱచు ను
దాత్తభవద్భక్తియుక్తు లగువారి శివా!

168
  1. బత్తళి = నగ్నత్వము