పుట:శివతత్వసారము.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

రుద్రాక్షభూతిభూషణ
ముద్రాంకితు నెదురుగన్న ముదమున సాక్షా
ద్రుద్రుఁ డని తలఁపఁడేని [1]శి
వా ద్రోహుఁడు నరకగామి యగును మహేశా!

158


క.

హరి పద్మజ వాసవ ని
స్తరవిభవములనుఁ దృణీకృతము లనిన మహే
శ్వర! నీ దృఢభక్తులకును
సురనరవిభవంబు లెంతచోద్యములు శివా!

159


క.

అసమాణిమాది గుణరస
రసాయనమ్ములును నిఖిలరాజితరాజ్యా
ది సుఖంబులు శివసుఖమున
కసమానము లండ్రు నీ శివైక్యులు రుద్రా!

160


క.

ఆకాశము వొడగెగసిన
భూకంపంబైనఁ బంచభూతప్రళయ
వ్యాకుల మైనను మఱచి శి
వైక్యుఁడు నిను విడిచి యొండు లాలింపఁ డజా!

161


క.

కులగిరులు జిర్ఱఁ దిరిగిన
జలరాసులు మేరదప్పి చనుదెంచిన నీ
వల నెఱిఁగిన దృఢభక్తుఁడు
చలియింపఁ డపారఘోరసంసారమునన్.

162


క.

దిక్కులు వీడ్వడి కలసిన
దిక్కరులు మదంబు డిగ్గి తిరిగిన మఱి నీ

  1. "శివద్రోహుఁడు నరకమందుఁ బడును మహేశా!" అని కవిప్రయుక్త మగునేమో! (పూ.ము.)