పుట:శివతత్వసారము.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జ్ఞానవిహీనాత్ముల (చెడు)
[1]పానలు వో విడిచి నిన్నె భజియింతు శివా!

46


క.

జ్ఞానస్వరూపుఁ డీశ్వరుఁ
డేనిసి వితర్కింప నట్టి యీశ్వరునకు న
జ్ఞానము దొరకొనఁ దని తా
ర్కాణం బదియేల చేయ రద్వైతు లజా!

47


క.

తా రద్వైతులు సచ్చి
త్కారణ సర్వజ్ఞ సర్వగత నిత్య నిరా
కారుఁడని చెప్పి వెండియ
కారణమ యవిద్య నీకుఁ గల్పింతు రజా!

48


క.

కలదన నోపక లేదని
పలుకఁగ నేరకయు మూకబధిరులక్రియ ని
మ్ముల నద్వైతులు తమలో
పల వగతురు భువనభిన్నభావమున శివా!

49


క.

ఆరాధ్యుం డారాధకుఁ
డారాధక మనఁగ లేని యద్వైతదురా
చారకృతసర్వశూన్యా
కారస్థితి నేమి సేయఁగా వచ్చు శివా!

50


క.

పాతకము సకలనాస్తిక
జాతనివాసంబు సర్వసంకర మాత్మా
ద్వైతం బనఁగా జగదు
త్పాతము దొరకొనునె యిట్లు పరమానందా!

51
  1. పానలు - సందేహములు