Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ద్రార్క్కతారకము సర్వ్వకారపరిహారము[1]గా నిచ్చితిమి మంగళ
మహ శ్రీశ్రీ.

—————

59

శ. స. 1157

(ఇది హైదరాబాదురాష్ట్రమునందు కరీంనగరముమండలములో ఉప్పరపల్లెగ్రామమున నొకదేవాలయములో ఱాతిస్తంభముమీఁద చెక్కఁబడిన శాసనభాగము. Hyderabad Archeological Series No. 3. అనుపత్రికనుండి గ్రహింపఁబడినది.)

ఉ.

శ్రీమదనూనదానజలసేవకుం బాయక మ్రోయుషట్పద
స్తోమనినాదము న్వినుచు సూరెల నెప్పుడుం బ్రస్తుతించు సి
ద్ధామరకోటికి న్వరదుండైన గణేశుండు సుస్థిరస్థితిం
గ్రామసమానమూర్తి యగు కాటయ కీవుత మిష్టసంపదల్.

1


క.

చరణసరోరుహరాగ
స్ఫురణ న్మహిషునిశిరంబు వొలుపుగ సంధ్యా
భ్రరుచి నెనయ మెట్టిన స
త్కరుణాన్విత దుర్గ్గి వరము గాటయ కొస(౦)గున్.

2


క.

ఉరగేంద్రదిగ్గజములకుం
బరమోత్సాహముగ నాతపత్రమువోలె
న్ధర యెత్తిన కిరివరుం డగు
హరి గాటయ కీవుతము దయామతి శుభముల్.

3


క.

దేవాదిదేవుం డమిత
స్థావరజంగమమయుండు సర్వ్వేశుండు గౌ
రీ(వ)రుం డనవరతంబును
నీవుతం గాటయకు దయ నభీష్టఫలంబుల్.

4
  1. సర్వ్వకరపరిహారము