ఇ ట్లేలి సప్తసంతానంబులు దేవబ్రాహ్మణదత్తులు సమస్తధర్మ్మం
బులుం బ్రతిపాలించ్చి॥ స్వస్తి చరణసరోరుహవిహితవిలోచన
త్రిలోచనప్రము ఖాఖిలప్రిథ్వీశ్వర కారితకావేరీతీర కరికాలకుల
రత్నప్రదీపాహితకుమారగజాంకుశ యొఱయూరిపురవరాధీశ్వర
సూర్య్యవంశోద్భవ కాస్యపగోత్ర[8] తేంక్గణాదిత్య జగదొబ్బ
గండ్డ కీర్త్తినారాయణ సమస్తప్రశస్తి సహితంబు శ్రీమనుమహా
మండలేశ్వర యోపిలి సిద్ధనదేవచోడమహారాజులు స్వస్తి శ్రీశక
వర్షంబులు 1146 గు తారణసంవత్సర కార్త్తికశుద్ధ శ్రీ
యేకాదసిశుక్రవారమునం గమ్మనాంటిలోన నిజరాజధానియైన
కొట్టియదొన శ్రీశంకరేశ్వరశ్రీమహాదేవరకు గణపతిదేవమహా
రాజునకు ధర్మ్ము(వు)గా హవిర్బలి యర్చ్చనలకు[9] నంగ
భోగరంగభోగాలకు నందుల మొగడచెఱువు దేవభోగ మాచం