Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

51

శ. స. 1095

(ఈశాసనము గుంటూరుమండలములో కొణిదెనగ్రామమందు శ్రీశంకరేశ్వరస్వామిగుడిలో నొకఱాతిమీఁద చెక్కఁబడియున్నది. ఈపద్యము చివరను "(స్వ)స్తిశ్రీమత్రిభువనచక్రవర్తి శ్రీరా(జరా)జదేవర విజయరాజ్యసంవత్స(రం)బులు 28 శ్రాహిశకవర్షంబులు....." అని యున్నది. వర్షసంఖ్య ఖిలమైపోయినది. South Indian Inscriptions Vol. VI. No. 183 సంఖ్య గలశాసనములో "స్వస్తి శ్రీమత్త్రిభువనచక్రవర్త్తి శ్రీరాజరాజదేవ(ర) విజయరాజ్యసంవత్సరంబులు 11 ణ్డగు శ్రాహి శకవర్షంబులు 1078 ది యగునేంటి ఫాల్గుణబహుళ యెకాదశియు శనివారము నాండు" ఇత్యాదిగా నున్నది. దీనిని బట్టి రాజరాజదేవరరాజ్యము 1062 వ సంవత్సరమునఁ బ్రారంభమైనట్లు కనఁబడుచున్నది. కావున నాతనిరాజ్యకాలములో 28వ సంవత్సరము 1095 శకసంవత్సర మగును. South Indian Inscriptions Vol. VI. No. 626.)

చ.

... ... ... ... ... ... ... ... ... ...
...త మగుచుండం(గ)... వరకాం(త్తి)దీప మా
యతిశరకాండ[1]శకాబ్దముల న్విలసిల్లుచుండం(గా)
నతిసయ[2]లీలతో విషు(వున)౦ద్దు వినిర్మ్మలధర్మ్మమూర్త్తి యై.

(మొదటిపాదమును రెండవపాదములోఁ గొంతభాగమును ఖిలమైపోయినవి.)

——————

  1. "శరకాండదిగ్మిత" అని యుండనోపు.
  2. "నతిశయలీల" అని యండవలయును.