Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

శ. స. 1100 ప్రాంతము

(ఈశాసనము గోలకొండదేశములో వెలిగందల యనుప్రాచీననామముగల కరీంనగరముపట్టణమునందు అవ్వల్ తాలూకాదారు (కలెక్టరు) కచ్చేరీలో నున్న యొకఱాతిమీఁద చెక్కఁబడియున్నది. అక్షరముల యాకారమును బట్టి 12వ శతాబ్దము లోనిదని తోఁచుచున్నది.)

స్రగ్ధర.

శ్రీకాన్తాకాన్తుచే (నా)శ్రితవిబుధజనాశీస్థిరప్రాజ్యరాజ్య
శ్రీకాన్తాకాన్తుచే విస్త్రితనిజభుజనిస్త్రింశనీతాన్యరాజ
శ్రీకాన్తాకాన్తుచే దిక్షితిగగనసమాశ్లిష్టవిస్పష్టకీర్త్తి
శ్రీకాన్తాకాన్తుచే నూర్జ్జితరిపుమ్రిగరాజీమ్రిగారాతిచేతన్.

1


చ.

వ్రి॥ పరనరపాలమౌలిమణిభాసురదీప్తిలతావితానవి
స్ఫురితపదాబ్జుచే నహితభూతలనాథవరూధినీసరో
వరమధనప్ర(భూ)తమదవద్విరదాధిపుచే విరోధిభూ
ధరశిఖరప్రభిన్నవిదితత్రిదశేంద్రనిశాతహేతిచేన్.

2


క.

సురకరిపరిమ్రిగపతి...తి
సుర(స)తి(క)మలసరసిరుహ

3

(అసంపూర్ణము)

—————

53

శ. స. 1110

(ఈశాసనము దాక్షారామమునందు భీమేశ్వరాలయమం దున్నది. శాసనకాలము గల మొదటిభాగము ఖిలమైపోయినది. “శ్రీమన్మహామణ్డలిక దోరపనాయకుల ప్రధాని సోమనపెర్గడ కొడ్కు దత్తెనపెగడ" శ. స. 1080 మున శ్రీభీమేశ్వరదేవర కఖండవర్తిదీపము నిలిపినట్లు 1179 సంఖ్యగల శాసనమువలనఁ దెలియుచున్నది గానఁ బ్రస్తు