Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

వననిధిపరివ్రిత మాదిం గల[1]
యనఘ శివాలయము లెన్ని...(కాం)
చనకలశంబులు పెట్టిన
యిననిభుం డగు గొంక్కధారుణీశ్వరుచేతను.

5

(అసంపూర్తి)

—————

46

శ. స. 1083

(ఈశాసనము గుంటూరుమండలములో నరసారావుపేఁటతాలూకా తిమ్మాపురగ్రామమున కుత్తరముగా నున్నఱాతిస్తంభముమీఁద చెక్కఁబడియున్నది.)

శ్లో.

శ్రీజయలక్ష్మీ ... ... ఃపరమణ్డలికాన్వయాబ్జదే...మధామః
వైభవజితమహేంద్రో(జ)యతికులోత్తుంగచోడగొంకన(రే)౦ద్రః.

1


వ.

ఇట్టి శ్రీ గొంకరాజుల కిష్టభ్రిత్యు డైన (స)రణయ నామావలి
యెట్టిదె.

2


ఉ.

శ్రీవిలసద్విలాసజి(త)జిష్ణునిచే నహిసీమ క్రిష్ణుచే
దేవసమానుచేత నరదేవశిఖామణిచేత ధాన్యవా
టీవరవ్రిత్తిశాసనపటీయశి నాంటగి మేలు నాయక
శ్రీవిభుం డొప్పెం బోతయ వశీక్రితసజ్జనలోకుం డై భువిని.

3


క.

జితకాశి దూబవాడకుం
బతి వోతయనాయకునకు భావజరాజ్యా
న్వితలక్ష్మి యుదయమయ్యెను
సుతనుశ్రీవిజితరంభ సొక్కమ ధరణిని.

4
  1. మహింగల