Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

మితగుణశీలరూపములె[1] మేనక నూర్వ్వశి రంభం బోలి సం
స్తుతి కెఱవట్టమై వెలయు సొక్కను శీలమునందు మానవీ
వితతి నధఃక్కరించి సుకవిద్విజబాన్ధవ(వంది) బ్రింద్దస
మ్మతవిపులార్త్తదాన[2]మహిమం బ్రభ దాల్చినధన్య వెంప్పునను.

5


క.

ధర సనదవోలిపణ్డీ
శ్వరదేవ(ర) నర్త్తకియ ద్రివర్గ్గఫలశ్రీ
కర సొక్కమ మాహేశ్వర
పరివారస్త్రీలలోనం బ్రస్తు(తిం) దనరెను.

6


చ.

సురవనితావిలాస యగ్రుసొ)క్కమ కుద్భవమైరి దేవతా
వరము(నం జేసి) వీరభటవంశవిరాముణ్డు (కా)ముణ్డును మహీ
నరనుతశౌర్య్యమూర్త్తి సరసణ్డును గోకమహీశుదేవియై
పరిగిన ల(క్ష్మి)దేవియనం బ్రస్తుతి కెక్కిన కామదేవియును.

7


క.

నరనుతరాజకలాగమ
గురుణ్డు గులోత్తుంగచోడగొంకధరిత్రీ
శ్వరు డీశ్వరాంశ మగుటం
బరగినశ్రీకామిదేవి పార్వ్వతిం బోలును.

8


క.

కామాంబిక నిజాగ్రజుఁగ
గామని పరభటవారని... మన.... బుధచి[3]
న్తామణి నన్వయవనజన
భోమణి.......౦ దగు నభోమణితేజును.

9
  1. "రూపముల" అని యుండనోపు.
  2. విపులార్త్థదాన
  3. ఈపద్యము మొదటిరెండుపాదములకు సరియైనపాఠము దొరకలేదు.