| |
సంఖ్య సక[1]ధారుణీపాలు సమము లమరం
బ్రబలుచుండ నఖండదీపంబు నిలిపె.
| 1
|
31
(ఈశాసనము గుంటూరుమండలములో నాదెళ్లగ్రామమందు గోవర్ధనస్వామి యాలయములో నొకఱాతిస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. South Indian Inscriptions Vol. IV. No. 806.)
| శా. |
శ్రీమన్మూర్త్తి వడాలుకాటయకు రాజీవాక్షి సూరాంబ భూ
భామాసన్నిభ(నా) జనించె వినుతప్రా(ధా)న్య దత్కాంత్త కు
ద్దామశ్రీ జనిమించె[2] వెన్నమ మహాధర్మ్మిష్ఠి నాదిండ్ల(ను)
న్రామారత్నము నిలిపె[3] దీపము జగద్రమ్యంబుగా శౌరికిని.
| 1
|
| క. |
కరగిరిదిగ్మితశకవ
త్సరముల శుక్లసితపక్షదశమియు విధువా
సరమున శ్రీకేశవదే
వరకును దీపంబు నిలిపె వసుమతి వెలయను.
| 2
|
- ↑ శక
- ↑ జనియించె
- ↑ నిల్పె