ఈ పుట అచ్చుదిద్దబడ్డది
20
శ. స. 1068
(ఈశాసనము కృష్ణామండలములో బెజవాడగ్రామమందు ఇంద్రకీలపర్వతము సమీపమున ఖిలమై యున్నమండపములో నొకఱాతిస్తంభముమీఁద చెక్కఁబడియున్నది — South Indian Inscriptions Vol. IV. No. 749.)
శ్రీస(క)వర్షములు 106(8) గు నేంటి కార్త్తికబహు(లప)౦చ(మి)యు[1] నాదివారమున సూర్య్యగ్రహణనిమిత్తమున శ్రీ వేంగ్గీదేశచాలుక్య నంకకాఱ పరమండలచూఱకాఱ పతిదేవగురుద్విజభక్తలుం గుఱుముఱజముండును నైన శ్రీమన్మహామండలికభీమన సన్ధివిగ్రహి సోమనపెగ్గడ బెజవాడమల్లేశ్వరమహాదేవరకు నఖండదీపమునకు నిత్యనై(వేద్యా)లకు తానిచ్చిన యిన్పయెడ్లు 55। వీనిం జేకొని కుమ్మంగురికామనబోయుని కొడ్డు ప్రోలెబోయుని కొడ్కు ప్రోలయ(నంది) నిత్యమానెండు నెయి యాచంద్రార్కముం బుత్రానుపౌత్రికము నడపంగలవాండు.
సీ. | |