Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రూఢి కెక్కిన బెజవాడ మల్లేశ్వర
            దేవరకు నఖండదీపతతులు
పెట్టి గొంట్టూ(ర)౦ జెఱ్వులుం బెక్కుగుడ్లు[1]
నిల్పి[2] సప్తసంతతు లసంఖ్యలుగం జేసె
దత్తె(నా)మాత్యసోముండు ధర్మ్మపరుం డ్డు
దారభానుజుం డాచంద్రతారక(ముగ).

1


శా.

(భార)ద్వాజపవిత్రగోత్రుండు జగత్ప్రఖ్యాతిగాం బెట్టెం బు
ణ్యారంభుం డొరిగొండివల్లభుండు దత్తామాత్యసోమండు దా
క్షారా(మ)ప్రముఖోల్లసత్ప్రకటపంచారామతీర్త్థంబులను
సారాఖండదశాప్తదీపకము లాచంద్రార్క్కతారంబుగాను.

2

————

21

శ. స. 1068

(ఈశాసనము గోదావరిమండలమున దాక్షారామమునందు భీమేశ్వరాలయమున నున్నది. శాసనకాలము గలమొదటిభాగము ఖిలమై పోయినది. కాని, యీశాసనములో వర్ణింపఁబడిన సోమనప్రెగ్గడయు 20 సంఖ్యగల శాసనములోని సోమనప్రెగ్గడయు నొక్కఁడే యని స్పష్టపడుచున్నది. ఆశాసనము శ. స. 1068 లోఁ బుట్టినది. కాన నీశాసనము కూడ నాప్రాంతమునందే పుట్టియుండును — South Indian Inscriptions Vol. IV. No. 1180.)

శా.

భారద్వాజపవిత్రగోత్రుణ్డు జగత్ప్రఖ్యాతిగాం బెట్టెం భు
...భుం డ్డొర[3]గాండివల్లభుండు దత్తామాత్యసోముణ్డు దా

  1. గుడులు
  2. నిలిపి
  3. పుణ్యారంభుండ్డొర – అని యుండనోపు.