Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

శ్రీమద్రాఘవనృపతికి
సౌమిత్రియు ధర్మ్మజునకు (శ)క్రాత్మజుణ్డును
రామునకు హరియుం బోలుగ
...... వత్రు ణ్డగ్రజునకు నాప్తు ణ్డయ్యెను.

2


ఉ.

వాసవసన్నిభు ణ్డగు దివాకరరాజునకుం బులోమక
న్యాసమశీల యైనెగడు నాయమసానికి నుద్భవించె గం
గ్గాసలిలేశహాసశశికాశవికాసపయోజకీర్త్తికాం
త్తాసహితుండు దీప్రకరధామసుధాముణ్డు సోము ణ్డున్నతిని.

3


క.

భీమబలుణ్డును నర్చ్చిత
భీమేస్వరు ణ్డై[1]నవీరపెర్మ్మాడినృప
గ్రామణిం గొల్చి దివాకరు
సోమణ్డు విశ్వాసి యయ్యె సూనృతమహిమను.

4


క.

విశ్వాసి సోమనాయ్యుణ్డు
విశ్వంభరయంద్దు నెగడె విశ్రుతమహిమను
శాశ్వతకీర్త్తి దయామతి
నీశ్వరపదభక్తి నధిపహితనయశక్తిని.

5


చ.

సుచిరయశోవిలాసు ణ్డగు సోమనకుం కుల[2]పాలికాశిరో
విచకిల[3]పుష్పదామ మగువెన్నమకుం బ్రభవించె భారతీ
కుచతటతారహా(రు) ణ్ణనఘు ణ్డలఘుణ్డు వినిర్గ్గలత్సుధా
వచనుణ్డు ధర్మ్మలోలుణ్డు దివాకరు ణ్డి...పై సుధాకరు ణ్డిలను[4]

6
  1. భీమేశ్వరు ణ్డైన
  2. గుల
  3. విచికిల
  4. దివాకరు ణ్డీవి సుధాకరు ణ్డిలను - అని యుండనోపు.