Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

శ. స. 1339

(ఇది కృష్ణామండలము నందిగామతాలూకాలోని వేదాద్రిగ్రామమందు లక్ష్మీనరసింహస్వామి గుడిలో నొకఱాతిమీఁద చెక్కఁబడియున్నది. Government Epigraphist's Collection No. 306 of 1924)

శుభవస్తు, స్వస్తిశ్రీశకవర్షంబులు 1339 అగు నేంటి హే
మళంబ్బి సంవత్సర శ్రావణశు 5 గు స్వస్తి శ్రీమన్మహామండ్డలేశ్వర
మహారాయ రాయపరమేశ్వర అవఘళిరాయమానమర్ద్దన శింగ్గిణీ
ఠంకార రాయపక్షిసా(ళు)వా బిరుదప్రతాప పేరోజు(సు)లుతాను
రాజ్యప్రతిష్ఠాప(నా)చార్య్యుండైన మసదనయేలిఅబి ( )బునిదామ
లు మలక వొడయు(ల)౦గారి అనుజన్ముండైన శరఖుమలుక జైనదివొడ
యలు తూర్ప్పుదేశము క్రిష్ణవేణ్యాతీరం వోడపల్లి వజీరుబాద యేలు
చుంన్న తననిజహితుండైన యీజదిమలుకంగారిని శ్రీకృష్ణవేణ్యా
తీరము శ్రీరంగరాజుకొండ్డ యేలం బుత్తెంస్తేను సకళధంర్మ్మముల
లోనుంన్ను పరమధంర్మ్మ మని తమవొడయులైన జైనదిమలుక
వొడయులకుంన్ను నిదామలుకలుక వొడయలకుంన్ను పేరోజుసులు
తాని ఖొందాలమ్మంగారికింన్నిం బుణ్యముగాను జైనదిపురము చెఱువు
గట్టించ్చి అంన్నదాన వుదకదానములు పెట్టి శ్రీరంగ్గరాజుకొండ్డ
శ్రీకృష్ణవేణ్యా నీళ్లఱేవు పృథివింన్ని ఆకాశముంన్నుం గలకాలము
ఆచంద్రార్క్కస్తాయిగాను సౌపానములు గట్టించి పృథివి రాజ్యము
చేయుచుండ్డెను.


శా.

శ్రీరంగక్షితిపాలుశైలమునకుం జెంనొంద్దువాయవ్యమం
దారంగ్గాం దగు నీజిదీమలుక దానాచంద[1]తారార్క మై

  1. "చంద్ర" అని యుండవలయును.