5. అమరావతి
(ఈ శాసనము గుంటూరుమండలములో అమరావతీ గ్రామమందు అమరేశ్వరస్వామియాలయమునందు పెద్దమండపము దక్షిణపుగోడలోఁ గట్టఁబడియున్న యొకఱాతిమీఁద చెక్కబడియున్నది. South Indian Inscriptions Vol. VI. No. 240.)
ఉ. |
శ్రీరమణియ్యు ణ్డర్ద్ధిజన సేవ్యుణ్డు భవ్యుణ్ణు దివ్యమూర్త్తి శౌ
ర్య్యారభ(టీధుతా?)తినిశితాశివిదారితశత్రువర్గ్గుణ్డా
ధారిత బన్ధుమిత్ర (జ)న తామణి గొంక్కనరేంద్రమంత్రి(వ్రో)
త్సారితలోభ మోహ వ్రితసత్వుణ్డు (వ్రోలణ్డు) ధన్యు ణ్డున్నతిని.
| 1
|
క. |
శ్రీరాజవ్రోలిశాసను
ణ్డా రాధితనీలకణ్ఠు ణ్డ(భి)నవమదనా
కారుణ్డు వ్రోలణ్డు విబుధా
ధారుణ్డనం బొన్నరాంబతనయుణ్డు నెగడెను.
| 2
|
క. |
ఆతనివల్లభి గొమ్మమ
మాతంగ్గమరాలయాన మనసిజురతివి
ఖ్యాతయశోనిధి గొంక్కమ
హీతలపతి కరుణ లక్ష్మి నెంత్తయు వెలసెను.
| 3
|
ఉ. |
చారువిశుద్ధవంశదధిసాగ(ర)సంభవి తేంద్దులేఖ ల
క్ష్మీరుచితాంగ్గ(భాతి) నుపమింప్ప సతీత్వగుణ ప్రసిద్ధిమెయి[1]
నారయ సెజ్జప్రోలనికులాంగన గొమ్మమ మేలు సీతకును
వారిజబన్ధుకాంత్తకును వాసవుకాంత్తకు లక్ష్మిదేవికిని.
| 4
|
- ↑ మై