3. ద్రాక్షారామం
(ఈశాసనము గోదావరిమండలములో ద్రాక్షారామం గ్రామమందుభీమేశ్వరాలయమున నొకఱాతిపలకమీఁద చెక్కఁబడియున్నది. Epigraphia Indica Vol. IV. NO. 1007)
శ్లో။ |
శాకే సంవత్సరేషుమున్ని (వ)సునిధిగే రాజమార్త్తణ్డభూXX
త్పు(త్రీ)సా...నేత్రీకనకరచితం కల్పభూజాతపుష్పం
ప్రాదాద్భీమేశ్వరాయ వ్యదిశ దథ సదా దీప్యదాచంద్రతారంxx
దీపం రౌప్యం చ పాత్రం బిససదృశ భుజా రేవి దేవీతనూజXX
|
|
సీ. |
శ్రీవిష్ణువర్ధనభూవిభుదయ భూమి
దేవిం బోల్ రేవల దేవి కనిన
సోమలదేవి గుణారామ[1] జగదేక
సున్దరి మత్తేభ మందగమన
దొల్లి భీమేశ్వరవల్లభునకు సిత
మణిబనధ మిచ్చె సన్మణియుతముగ
నురువిచ్చె గంగనా బరువడి వినివారిం[2]
బురుడించునట్ల[3] సరసిజాస్య
గనకరచితరుచికరకల్పావనీరుహ
కుసుమ మిచ్చెం దనకు నసము వెరుగ
వెణ్డిమణ్డతో నఖణ్డితద్యుతి దీప
మమరనిచ్చె విమలకమలనేత్రి.
|
|
- ↑ ఇచట యతి తప్పినది. శ్యామలదేవి అనిన సరిపోవును గాని, సీసమందెల్లడఁ బ్రాసయతియే కనఁబడుచుండుటచే నాపాఠము కవిసమ్మతము కాదేమో యను సందేహము కల్గుచున్నది.
- ↑ వినువారిం-అని యుండనోపు.
- ↑ నట్టుల