Jump to content

పుట:శాసనపద్యమంజరి.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. బెజవాడ

శ. స. 820 ప్రాంతము.

(ఈశాసనము బెజవాడ గ్రామమందు మల్లేశ్వరస్వామి యాలయములో నొకఱాతిమీఁద మూఁడుప్రక్కలను చెక్కఁబడియున్నది. Epigraphia Indica Vol. XV)

మధ్యాక్కర.

స్వస్తి నృపాంకుశాత్యన్తవత్సల సత్యత్రిణేత్ర
విస్తరశ్రీయుద్ధమల్లు ణ్డనవద్యవిఖ్యాతకీర్త్తి
ప్రస్తుత రాజాశ్రయుణ్డు ద్రిభువనాభరనుణ్డు సకల
వస్తుసమేతుణ్డు రాజసల్కి భూవల్లభుణ్డర్ర్త్తి[1]

1


పరగంగ బెజవాడ గొమరస్వామికి[2] భక్తుణ్డై గుడియు
నిరుపమమతి నృపధాము ణ్ణెత్తించ్చె నెగి దీర్చ్చె మఠంబు[3]
గొరగల్గా కొరు[4] లిన్దు విడిసి బృన్దంబు గొని యుణ్డువారు
... రిగాక యబ్బారణాసి వ్రచ్చిన పాపంబు గొణ్ఱు...

2


నెలయంగ నియ్యొట్టు ...స్సి మలినురై విడిసిన వ్రోల[5]
గలతానపతులును రాజు పట్టంబు గట్టినపతియు
నలియం బయ్వారల[6] వెల్వఱించిన నశ్వమేధంబు
ఫలం బు[7]పేక్షించిన లింగం బఱిసిన[8] పాపంబు దమకు

3
  1. వల్లభుణ్డర్థి
  2. గోమరసామికి
  3. మఠము
  4. ఇక్కడ “గొరగల్గాక” అనుచో లకారము తేల్చి పలుకవలయును.
  5. విడిసినం బ్రోలం
  6. నలియంబై వారల
  7. ఫలము
  8. మఱిసిన