Jump to content

పుట:శాసనపద్యమంజరి.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసనపద్యమంజరి

1. అద్దంకి

శ. స. 770 ప్రాంతము.

(ఈశాసనము గుంటూరు మండలమునందు అద్దంకి గ్రామమున నొకపొలములో నున్నఱాతిమీఁద చెక్కబడియున్నది. శాసనము పైభాగము కొంతయు నడుగుభాగము కొంతయు శిథిల మైపోయినది. Epigraphia Indica Vol. XIX)

తరువోజ.

పట్టంబుగట్టిన ప్రథమంబు నేణ్డు
            బలగర్వం బొప్పంగ బైలేచి[1] సేన
పట్టంబు గటిఞ్చి[2] ప్రభుబణ్డరంగు[3]
            బఞ్చిన సమత్త[4] పడువతో బోయ
కొట్టంబు ల్వణ్ఱెంణ్ణు గొణి[5] వేంగి నాణ్టిం
            గొళల్చి[6] యాత్రి భువనాంకుశ బణ[7] నిల్పి
కట్టెపుదుర్గ్గంబు గడు బయల్సేసి
            కణ్డుకూ ర్బెజవాడ[8] గావిఞ్చె మెచ్చి.
పణ్డరంగు పరమమహేశ్వరుణ్డు ఆదిత్యభటారనికి[9] ఇచ్చిన భూమి
యెనుబొదివుడ్ల ఆడ్లపట్టు[10] నేల దమ్మవురంబున దమ్మువులు వీని రక్షిఞ్చినవారికి
అస్వమేధంబున పలంబు[11] అగు.

  1. బొప్పంగం బై లేచి
  2. గట్టిఞ్చి
  3. ప్రభుం బణ్డరంగుం
  4. సామంత
  5. కొట్టము ల్పణ్ఱెణ్డు గొని
  6. గోళచి
  7. త్రిభువనాంకుశమున
  8. కందుకూ ర్బెజవాడ
  9. భట్టారకునకు
  10. వుట్లుళ్లపట్టు
  11. అశ్వమేధంబున ఫలంబు