Jump to content

పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనంత వ్రతము

స్యామి నక్షత్ర స్థానము త్తమమ్. 97. ఇహలోకే తు విపులాక్ సర్వాజ్ శామానవాప్నుహి, ఇతి దత్వా వరం దేవ సతైవాం తరధీయత. 98. కౌండిన్యోప్యోగతో గేహం చచార వ్రత ముత్తమం, శీలయా సహ ధర్మాత్మా భుక్త్వా భోగా యథేప్సి తాన్. 99. పుత్ర పౌత్రైః పరివృతస్థతో నక్షత్రతాం గతః, కల్పస్థాయీ చ సమ్భూతో దృశ్యతేద్యాపి స ద్విజః. 100. కుంభజేన పురా చీర్ణం మర్త్యలోకే ప్రకాశితం, సగరేణ దిలీపేన భరతేన మహాత్మనా. 101. హరిశ్చన్రేణ భూపేన జనకే నాపి పాండవ, ఏతే చాన్యే చ బహవః రాజ్యం భుక్త్వా దినం గతాః ఏతత్తే కథితం పార్థ వ్రతానాముత్తమం వ్రతమ్. 102. యత్కృత్వా సర్వపాపేభ్యో విముక్తః సుఖమశ్నుతే, యేవై శృణ్వన్తి సతతం పఠ్యమానం నృపోత్తమ, ఆప్లైశ్వర్యాది భోగాంశ్చ భుర్తేత్ర స్వజనైః సహ. 103. సర్వపాపైర్విని గుర్తొస్తే యాన్తి పరమాం గతిమ్.

భవిష్యో తరపురా ణేఒనంత వ్రతకల్పః సమాప్తః


అనంతవ్రతకథ

పాండవు లకణ్య వాసము చేయుచు మిక్కిలి కష్టపడు చుండఁగా, వారిని విచారించుటకై శ్రీకృష్ణుఁడు వచ్చెను. పాండవులంద ఱతనికి వరుసగా నమస్కరించి యాతనికి నుచితాసనమిచ్చి తామును గూర్చుండిరి. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణునిఁ జూచి, ఓజనార్దనా! నేను తములతోను భార్యతోనుగూడి మిక్కిలి